ఏపీకే ఫైల్స్ తో ..హైదరాబాద్ లో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగికి రూ.13 లక్షలు టోకరా

ఏపీకే ఫైల్స్ తో ..హైదరాబాద్  లో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగికి రూ.13 లక్షలు టోకరా

ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఆన్‌‌లైన్‌‌లో లక్షలాది యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటినే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వాట్సప్, ఫేస్‌‌బుక్‌‌, ఎక్స్, టెలిగ్రామ్‌‌ ప్లాట్​ఫామ్స్​పై ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాట్సప్​కు మెసేజ్​లు, లింక్స్ పంపి సైబర్ నేరగాళ్లు అట్రాక్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్‌‌మెంట్స్, వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోం, ట్రేడింగ్‌‌, జాబ్, లోన్‌‌ ఫ్రాడ్స్ సహా పీఎం కిసాన్‌‌ యోజన, ముద్రా లోన్స్ పేరుతో ఆన్‌‌లైన్‌‌లో నకిలీ లింకులు పంపిస్తున్నారు. సోషల్‌‌ మీడియాలో ట్రాప్ చేసి, లింక్స్‌‌తో బ్యాంక్ అకౌంట్లను కొల్లగొడ్తున్నారు.  హైదరాబాద్ లో ఇలానే ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగికి రూ. 13 లక్షలు టోకరా పెట్టారు స్కామర్స్.

అసలేం జరిగిందంటే...పంజాబ్ నేషనల్ బ్యాంక్ లైఫ్ సర్టిఫికెట్ పేరిట ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని మోసగించారు చీటర్స్.  హైదరాబాద్ బర్కత్ పురా ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి అక్టోబర్  4న ఫేస్ బుక్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేరిట ఉన్న ఓ లింక్ ను క్లిక్ చేశాడు.  పంజాబ్ నేషనల్ బ్యాంక్ లైఫ్ సర్టిఫికెట్ కోసం అంటూ నకిలీ లింక్ పెట్టిన సైబర్ చీటర్స్.  ఆ విషయం తెలియక బ్యాంక్ అకౌంట్ వివరాలను బాధితుడు తెలియజేశాడు.  అనంతరం బ్యాంక్ లోగో డీపీతో బాధితుడిని వాట్సాప్ లో సంప్రదించారు  స్కామర్స్.  లైఫ్ సర్టిఫికెట్ ప్రాసెస్ చేయడానికి ఓ ఏపీకే ఫైల్ పంపించి ఇన్ స్టాల్  చేయాలని సూచించారు  స్కామర్స్. 
అది నిజమని నమ్మి ఏపీకే ఫైల్ ను ఇన్ స్టాల్ చేశాడు   బాధితుడు. కాసేపటికి అతని పంజాబ్ నేషనల్ బ్యాంక్  సేవింగ్ అకౌంట్ నుంచి రూ. 12.99 లక్షలు డెబిట్ అయినట్లు గుర్తించాడు బాధితుడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

►ALSO READ | ఆన్లైన్లో రేటింగ్ ఇస్తున్నారా..? సంగారెడ్డి జిల్లాలో ఐటీ ఉద్యోగి రూ.54 లక్షలు ఎలా మోసపోయాడో చూడండి !