బుక్స్ డిజిటలైజేషన్‌‌‌‌ పేరుతో స్కీం

బుక్స్ డిజిటలైజేషన్‌‌‌‌ పేరుతో స్కీం
  • వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌లో పుస్తకాల స్కానింగ్
  • 10 వేల పేపర్లకు 50‌‌‌‌‌‌‌‌ వేలు ఇస్తమన్నరు
  • 620 మంది బాధితులకు 15 కోట్ల టోపీ
  • గతంలోనే ముగ్గురు అరెస్ట్, మరొకరిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రూ.15 కోట్లు కొల్లగొట్టిన ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితులను నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు. జాయింట్‌‌‌‌ సీపీ గజరావ్ భూపాల్ వివరాలు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన దీపక్ శర్మ (27)  రెండేండ్ల కిత్రం డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌‌‌‌లో కంపెనీ రిజిస్టర్ చేశాడు. ఘజియాబాద్ కు చెందిన సయ్యద్‌‌‌‌ సమీర్‌‌‌‌‌‌‌‌ ఉద్దీన్‌‌‌‌ (27), ఆశిష్‌‌‌‌ కుమార్‌‌‌‌ ‌‌‌‌(33), అమిత్‌‌‌‌ శర్మ (36) అనే వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించాడు. నలుగురు కలిసి దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఓపెన్ చేశారు. ఇందులో భాగంగా నిరుడు జులైలో హైదరాబాద్‌‌‌‌ బంజారాహిల్స్‌‌‌‌లో బ్రాంచ్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ఏడాది జూన్‌‌‌‌ వరకు కార్యకలాపాలు నిర్వహించారు. డిజిటల్‌‌‌‌ ఇండియా పేరుతో ప్రచారం చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చని నిరుద్యోగులను ట్రాప్ చేశారు. వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ పేరుతో  చెయిన్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ స్కీమ్ ప్రారంభించారు. ఇండియాలో ఉన్న పాత పుస్తకాలు, నవలలను డిజిటలైజ్‌‌‌‌ చేస్తున్నట్లు ప్రచారం చేశారు. ఇంటి వద్ద ఉండే పేపర్లను డిజిటలైజ్ చేయాలని చెప్పారు.10 వేల పేపర్లు స్కాన్ చేస్తే రూ.50 వేలు ఇస్తామని చెప్పుకున్నారు. ఇందుకు 25 రోజుల గడువు విధించారు. స్కీమ్‌‌‌‌లో చేరిన వారి నుంచి డిపాజిట్‌‌‌‌ రూపంలో రూ.లక్ష వసూలు చేశారు. ఆ డబ్బుతో యూఎస్‌‌‌‌, యూరప్‌‌‌‌ దేశాల నుంచి స్కానర్స్‌‌‌‌ ఇప్పిస్తామని చెప్పారు. రూ. లక్ష డిపాజిట్ చేస్తే రూ.2.5 లక్షలు ఇస్తామని నమ్మించారు. ఈ గ్యాంగ్‌‌‌‌ ట్రాప్‌‌‌‌లో చిక్కి రాష్ట్రవ్యాప్తంగా 620 మంది స్కీమ్‌‌‌‌లో చేరారు. డిపాజిట్స్ చేసిన వారికి కొంతకాలం డబ్బు రిటర్న్ చేశారు.

ఎక్కువ డిపాజిట్స్, తక్కువ రిటర్న్స్

స్కానింగ్ స్కీమ్‌‌‌‌లో చేరిన వారితో చైన్ సిస్టమ్‌‌‌‌ దందా చేశారు. ఎక్కువ డిపాజిట్లు తీసుకుని తక్కువ రిటర్న్స్‌‌‌‌ అందించారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.లక్ష మొదలుకొని రూ.20 లక్షల వరకు వసూలు చేశారు. ఇలా 620 మంది నుంచి రూ.15 కోట్లకు పైగా వసూలు చేశారు. వచ్చిన డబ్బుతో ముందుగా 2 కిలోల బంగారం కొనుగోలు చేశారు. బంగారాన్ని మణప్పురం గోల్డ్‌‌‌‌లో తాకట్టు పెట్టి క్యాష్ చేసుకున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఢిల్లీకి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్‌‌‌‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సయ్యద్ సమీర్ ఉద్దీన్ ,ఆశిష్ కుమార్, అమిత్‌‌‌‌శర్మలను రెండు నెలల క్రితం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న దీపక్ శర్మను గురువారం ఢిల్లీలో అరెస్ట్ చేసి శుక్రవారం హైదరాబాద్ తరలించారు.