సర్కారు బడుల సమాచారాన్ని సేకరిస్తున్న విద్యాశాఖ 

సర్కారు బడుల సమాచారాన్ని సేకరిస్తున్న విద్యాశాఖ 
  • మరోసారి వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ 
  • సమాచారం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు 
  • దీని ఆధారంగానే  బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో కేటాయింపులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల సమాచారాన్ని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మరోసారి సేకరిస్తున్నారు. స్కూల్‌‌‌‌‌‌‌‌లో స్టాఫ్, ఫెసిలిటీస్ ఏమున్నాయి.. ఇంకా ఏం కావాలి అనే డేటా తీసుకుంటున్నారు. స్కూల్ పాయింట్ల నుంచి తీసుకునే ఈ సమాచారంతోనే ప్రభుత్వం నిధులు కేటాయించనుంది. ఈ అకడమిక్ ఇయర్​నుంచే ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సర్కారు ఇటీవల ప్రకటించింది. మొత్తం 26 వేల సర్కారు స్కూళ్లను రూ.7,289.54 కోట్ల బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో డెవలప్​ చేస్తామని చెప్పింది. 2021–22 అకడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్ ఫేజ్‌‌‌‌‌‌‌‌లో 9,123 బడులను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. యు–డైస్‌‌‌‌‌‌‌‌ నుంచి తీసుకున్న డేటాతోపాటు బడుల నుంచి తీసుకున్న ప్రైమరీ డేటా ఆధారంగా బడ్జెట్‌‌‌‌‌‌‌‌ ఎస్టిమేషన్‌‌‌‌‌‌‌‌ను తయారు చేశారు. చాలా వరకు వివరాలు ఇందులో ఉన్నా.. ఇటీవల కొన్ని మార్పులు జరిగాయని, మరోసారి వివరాలు తీసుకోవాలని సర్కారులోని పెద్దలు నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారివారి సెగ్మెంట్లలోని స్కూళ్ల వివరాలను డీఈవోలు, ఎంఈవోల ద్వారా సేకరిస్తున్నారు. వాళ్ల పరిధిలో ఉండే నిధులను కూడా స్కూల్స్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు కేటాయిస్తుండడంతో దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నారు.  

టీచర్లెందరున్నరు.. రూములెన్నున్నయ్ 

‘మన ఊరు–మన బడి’ ప్రోగ్రాంలో భాగంగా స్కూల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. స్కూల్‌‌‌‌‌‌‌‌లో స్టూడెంట్ల వివరాలతోపాటు బడుల్లో ఉన్నవి, ఇంకా కావాల్సిన వాటి డేటాను తీసుకుంటున్నారు. స్కూల్ ఎంత విస్తీర్ణంలో ఉంది? ఓపెన్ ప్లేస్ ఎంత ఉంది? అనే వివరాలూ కలెక్ట్ చేస్తున్నారు. స్కూల్‌‌‌‌‌‌‌‌లో శాంక్షన్డ్‌‌‌‌‌‌‌‌ స్ట్రెంత్, ఎంతమంది పని చేస్తున్నరు? ఎన్ని క్లాసు రూములున్నయ్‌‌‌‌‌‌‌‌? శిథిలావస్థలో ఉన్నవి ఎన్ని? కాంపౌండ్ వాల్, వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్ వివరాలు, డిజిటల్ క్లాస్ రూమ్స్‌‌‌‌‌‌‌‌, గ్రీన్ బోర్డులు, డెస్క్ టేబుల్స్, కరెంట్‌ బకాయిలు, కిచెన్ షెడ్లు, గ్రౌండ్ తదితర వివరాలు సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా జిల్లా, స్టేట్ డేటాను అధికారులు తయారు చేయనున్నారు. ‘ఇప్పటికే ఉన్న వివరాలను కేబినేట్ సబ్ కమిటీకి ఇచ్చాం. దాన్ని అప్రూవ్ చేసింది. తాజాగా కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి కాబట్టి మరోసారి వివరాలు సేకరిస్తున్నాం. వీటి ఆధారంగానే బడుల్లో ఫెసిలిటీస్ కల్పిస్తాం’ అని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.