రన్నింగ్ ట్రైన్ లో స్కూల్ గర్ల్, బాయ్ స్టంట్స్

రన్నింగ్ ట్రైన్ లో స్కూల్ గర్ల్, బాయ్ స్టంట్స్

తమిళనాడు: చెన్నైలో రన్నింగ్ ట్రైన్ లోకి ఎక్కి స్టంట్స్ చేస్తూ ఇద్దరు విద్యార్థులు హల్ చల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుమ్మిడిపూండి సబర్బన్ రైలు కవరైపేట స్టేషన్ నుంచి వెళ్తుండగా.. స్కూల్ యూనిఫాంలో ఉన్న అబ్బాయి, అమ్మాయి ఫుట్ పాత్ పై నుంచి పరుగెత్తుతూ రైలు ఎక్కారు. రన్నింగ్ ట్రైన్స్ నుంచే కాళ్లు బయటకు పెట్టి స్టంట్స్ చేశారు. వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రమాదకర స్థితిలో స్టంట్స్ చేసిన స్కూల్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు.