అయ్యప్ప మాలతో వచ్చాడని స్కూల్​లోకి రానియ్యలే

అయ్యప్ప మాలతో వచ్చాడని స్కూల్​లోకి రానియ్యలే
  • సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఘటన

సదాశివపేట, వెలుగు: అయ్యప్ప మాలతో వెళ్లిన టెన్త్​స్టూడెంట్​ను సంగారెడ్డి జిల్లాలోని ఓ స్కూల్​యాజమాన్యం లోనికి రానియ్యలేదు. మాల తీసే వరకు స్కూలుకు రావద్దని వెనక్కి పంపించారు. స్టూడెంట్​తల్లి లక్ష్మి వివరాల ప్రకారం.. సదాశివపేటకు చెందిన రాకేశ్ స్థానిక సెయింట్ మేరీ హైస్కూల్​లో టెన్త్​క్లాస్​చదువుతున్నాడు. అయ్యప్ప మాల ధరించిన రాకేశ్​సోమవారం స్కూల్​కు వెళ్లాడు. స్కూల్ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. మాల తీసేసే వరకు స్కూలుకు రావొద్దని వెనక్కి పంపించారు. రాకేశ్ ఆ విషయాన్ని తల్లి లక్ష్మికి ఫోన్​చేసి చెప్పాడు. ఆమె వచ్చి యాజమాన్యాన్ని నిలదీసింది. మాలతో వస్తే ఎందుకు అనుమతించరని ప్రిన్సిపల్ ను ప్రశ్నించింది. ఆ విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వాములు, బీజేపీ లీడర్లు స్కూలుకు చేరుకుని యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. దాంతో చివరికి రాకేశ్​ను లోపలికి అనుమతించారు. ఇలాంటివి రిపీట్​అయితే సహించేది లేదని, స్కూల్​మేనేజ్​మెంట్​పై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ మాణిక్​రావు, అయ్యప్ప స్వాములు డిమాండ్​చేశారు.