యూపీ, కర్నాటకలో స్కూళ్లు ఓపెన్

యూపీ, కర్నాటకలో స్కూళ్లు ఓపెన్
  • కర్నాటకలో ఇయ్యాల స్కూళ్లు ఓపెన్
  • యూపీలో రేపట్నుంచి ప్రారంభం 

న్యూఢిల్లీ: కరోనా కొద్దిగా తగ్గడంతో పలు రాష్ట్రాలు స్కూళ్లను ఓపెన్ చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో బడులను ప్రారంభించగా.. ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఎంపిక చేసిన జిల్లాల్లో 9 నుంచి 12 తరగతులకు సోమవారం నుంచి క్లాసులు ప్రారంభించనున్నట్లు కర్నాటక ప్రభుత్వం తెలిపింది. ఉత్తరప్రదేశ్ లోనూ సోమవారం నుంచే బడులు ప్రారంభం కావాల్సి ఉండగా, ఆ రాష్ట్ర మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మరణించడంతో అక్కడ పబ్లిక్ హాలీ డేగా ప్రకటించారు. మంగళవారం నుంచి క్లాసులు మొదలు కానున్నాయి. 6 నుంచి 8 తరగతులకు మాత్రమే క్లాసులు ప్రారంభించనున్నట్లు యూపీ సర్కార్ చెప్పింది. స్కూల్స్ రీఓపెన్ పై కర్నాటక సర్కార్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. పాజిటివిటీ రేటు 2 శాతం కన్నా తక్కువున్న జిల్లాల్లోనే బడులు ప్రారంభించనున్నట్లు పేర్కొంది. స్కూళ్లు ఓపెన్ అయినా ఆయా తరగతులకు ఆన్ లైన్ క్లాసులు కూడా జరుగుతాయని చెప్పింది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్​ టీకా వేయించుకున్నాకే స్కూళ్లకు రావాలంది. కాగా, యూపీలో రెండు షిఫ్టుల్లో క్లాసులు నిర్వహించనున్నారు. ఫస్ట్ షిఫ్టు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12, సెకండ్ షిఫ్టు మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉండనుంది. 50 శాతం మంది పిల్లలతోనే క్లాసులు నిర్వహించనున్నారు.