కేయూలో ముగిసిన సైన్స్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌

కేయూలో ముగిసిన సైన్స్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌
  • మొత్తం ఐదు ప్లీనరీ లెక్చర్లు.. 164 ఓరల్‌‌‌‌ ప్రజంటేషన్లు
  • ఉత్తమ ప్రజంటేషన్లకు అవార్డుల ప్రదానం

హనుమకొండ, వెలుగు : తెలంగాణ అకాడమీ ఆఫ్‌‌‌‌ సైన్సెస్, కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ సైన్స్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ – -2025’ గురువారంతో ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సైంటిస్టులు, ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్‌‌‌‌ పాల్గొన్నారు. ఏడు థీమాటిక్‌‌‌‌ ట్రాక్స్‌‌‌‌లో భాగంగా ఐదు ప్లీనరీ లెక్చర్లు, 164 ఓరల్‌‌‌‌ ప్రజంటేషన్లు, 48 గెస్ట్ లెక్చర్స్ నిర్వహించారు. 

గురువారం కేయూ ఆడిటోరియంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో చీఫ్‌‌‌‌ గెస్ట్‌‌‌‌, సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌‌‌‌ మోహన్‌‌‌‌ రావు మాట్లాడుతూ... ఏఐ, ఎంఎల్, స్పేస్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌, బయోటెక్నాలజీ తదితర అంశాలపై జరిగిన సెషన్లు సక్సెస్‌‌‌‌ అయ్యాయని అభినందించారు. 

సైన్స్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ ఆర్గనైజింగ్‌‌‌‌ సెక్రటరీ ప్రొఫెసర్‌‌‌‌ వెంకటరాంరెడ్డి మాట్లాడుతూ సైన్స్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌లో భాగంగా ఉమెన్‌‌‌‌ సైంటిస్ట్‌‌‌‌ మీట్‌‌‌‌, టీచర్స్‌‌‌‌ మీట్‌‌‌‌, స్టూడెంట్స్ మీట్, ప్యానెల్ డిస్కషన్ వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. 

రెండు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయని, పోస్టర్, ఓరల్‌‌‌‌ ప్రజెంటేషన్లతో కలిపి మొత్తం 780 మంది పరిశోధకులు తమ రీసెర్చ్‌‌‌‌ పేపర్స్‌‌‌‌ సమర్పించినట్లు తెలిపారు. కేయూ వీసీ ప్రొఫెసర్‌‌‌‌ ప్రతాప్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ... లర్నింగ్, షేరింగ్, డిస్కషన్స్‌‌‌‌ ద్వారానే పరిశోధనల్లో పురోగతి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌‌‌‌ రామచంద్రం, ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్‌‌‌‌ సత్యనారాయణ, సైన్స్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ అకాడమీ ట్రెజరర్‌‌‌‌ ఎస్ఎం.రెడ్డి, కేయూ యూజీసీ కోఆర్డినేటర్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌ మల్లికార్జున్‌‌‌‌, సెషన్స్‌‌‌‌ కోఆర్డినేటర్‌‌‌‌ రవీందర్‌‌‌‌ పాల్గొన్నారు.

ఉత్తమ ప్రజంటేషన్లకు ప్రశంసాపత్రాలు

తెలంగాణ సైన్స్‌‌‌‌ కాంగ్రెస్ లో భాగంగా ఉత్తమ ఓరల్, పోస్టర్‌‌‌‌ ప్రజంటేషన్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఫిజికల్‌‌‌‌ సైన్సెస్‌‌‌‌ ఓరల్ ప్రజంటేషన్‌‌‌‌లో ఆనంది, పోస్టర్‌‌‌‌ ప్రజంటేషన్‌‌‌‌లో వెంకటరమణకు అవార్డు ఇచ్చారు. 

మ్యాథమెటికల్‌‌‌‌ సైన్సెలో ఓరల్‌‌‌‌లో -అభిలాశ్‌‌‌‌, పోస్టర్‌‌‌‌లో -రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌, కెమికల్‌‌‌‌ సైన్సెస్‌‌‌‌లో -నాగరాజు, -విక్రమ్, ఇంజినీరింగ్‌‌‌‌ అండ్‌‌‌‌ టెక్నాలజీలో సతీశ్‌‌‌‌కుమార్‌‌‌‌, -ఫారిన్‌‌‌‌ ఫాతిమా, ఫార్మసీలో శిరీష,- ప్రసాద్, ఎర్త్ సైన్సెస్‌‌‌‌లో శ్రీధర్, సతీశ్, లైఫ్‌‌‌‌ సైన్సెస్‌‌‌‌లో ఓరల్‌‌‌‌ ప్రజంటేషన్‌‌‌‌లో డాక్టర్‌‌‌‌ బి.అనేద, పోస్టర్‌‌‌‌ ప్రజంటేషన్‌‌‌‌లో లక్ష్మీ పునీతకు అవార్డులు దక్కాయి.