లింగాలలో వేరుశనగ పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

లింగాలలో వేరుశనగ పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

లింగాల, వెలుగు: మండలంలోని మాడాపూర్, మక్దంపూర్  గ్రామాల రైతులు సాగు చేస్తున్న వేరుశనగ పంటను పాలెం వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు శుక్రవారం పరిశీలించారు. నేషనల్  మిషన్  ఆన్  ఎడిబుల్  ఆయిల్​ సీడ్స్  పథకం ద్వారా అంబటిపల్లి పీఏసీఎస్  వారు రైతులకు పంపిణీ చేసిన జీజేజీ- 32 రకం వేరుశనగ విత్తనాల మొలక శాతం, పంట పెరుగుదల, పంట స్థితి వంటి అంశాలను పరిశీలించారు. అచ్చంపేట ఏడీఏ చంద్రశేఖర్, ఏవో అనిల్, ఏఈవో భరత్ కుమార్, రైతులు ఉన్నారు.

చిన్నచింతకుంట: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రొఫెసర్  జయశంకర్  వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్ర్తవేత్త శశిభూషణ్  తెలిపారు. ‘నాణ్యమైన విత్తనం -రైత్తన్నకు నేస్తం’ క్షేత్ర సందర్శనలో భాగంగా మండలంలోని కురుమూర్తి గ్రామంలో  వరి విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చీడపీడలను తట్టుకునే మేలైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. విత్తన శుద్ధి, నిల్వచేసుకోవడంపై అవగాహన కల్పించారు. ఏఈవో తిరుపతయ్య, రైతులు సహదేవ్, రాములు, నాగరాజు, బలరాం, కురుమన్న పాల్గొన్నారు.