ఆకులు, కొమ్మలు లేని చెట్టు..కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని..ఆక్సిజన్ విడుదల

ఆకులు, కొమ్మలు లేని చెట్టు..కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని..ఆక్సిజన్ విడుదల

సాధారణంగా చెట్లు అంటే ఎలా ఉంటాయి...పెద్ద కాండం..వాటికి కొమ్మలు..కొమ్మలకు ఆకులు. వీటిని చెట్లు అంటారు. కానీ కొత్తగా వచ్చే ఓ చెట్లుకు కాండం ఉండదు..కొమ్మలు అసలే ఉండవు..వాటికి ఆకులు కూడా ఉండవు. కానీ గాలిలోని కార్బన్ డయాక్సైడ్ మాత్రం పీల్చుకుంటాయి...ఆక్సిజన్ ను వదులుతాయి. అవేమి చెట్లో తెలుసుకోవాలని ఉందా...

ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. వీటికి అనేక కారణాలున్నాయి. కాలుష్యం వల్ల వెలువడే కార్బన్ డయాక్సైడ్ తో గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతోంది. దీనికి పరిష్కారం చెట్లను పెంచడమే. కానీ ప్రస్తుత కాలంలో చెట్లను పెంచేవారి కంటే నరికేవారే ఎక్కువయ్యారు. దీని వల్ల కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోయి.. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  ప్రజలకు అక్సిజన్ అందకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఈ సమస్య పరిష్కారానికి సెర్బియా శాస్త్రవేత్తలు అద్భుతమైన పరిష్కారం కనుగొన్నారు. వాతావరణ కాలుష్య పరిష్కారం కోసం లిక్విడ్ ట్రీ ని రూపొందించారు.

 
లిక్విడ్ ట్రీ ను ఎలా రూపొందిస్తారంటే...

 

సాంకేతికంగా లిక్విడ్ ట్రీను బయో రియాక్టర్లు అని అంటారు. నీళ్లు..ఒక రకం నాచు నింపి ప్రత్యేకమైన వెలుగునిచ్చే విద్యుత్ దీపాలను అమర్చిన ట్యాంకులే నీటి చెట్లు. నీళ్లలోని నాచు కార్బన్ డయాక్సెడ్ పీల్చుకుని.... విద్యుత్ బల్బు నుంచి వెలువడే కాంతి సాయంతో ఫొటో సింథసిస్ జరుపుతుంది. ఈ క్రమంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఈ నీటి చెట్ల ట్యాంకులకు  లిక్విడ్3 అని పేరు పెట్టారు. ఈ లిక్విడ్ 3 చెట్లు...పదేళ్ల వయసున్న రెండు పెద్ద చెట్లతో సమానంగా..200 చదరపు మీటర్ల స్థలంలోని గడ్డి.., మొక్కలతో సమానమైన స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ ను  పీల్చుకుంటుంది. 

లిక్విడ్ ట్రీ వల్ల  కార్బన్ డయాక్సైడ్ ఎలా తగ్గుతుంది..

నీళ్లలో అక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వివిధ శాతాల్లో కరిగి ఉంటాయి. వివిధ కారణాలతో నీళ్లో కార్బన్ డయాక్సైడ్ , అక్సిజన్ శాతం తగ్గినప్పుడు.. ..చుట్టూ ఉన్న గాలిలో నుంచి నీటిలోకి చేరుతాయి. లిక్విడ్ 3 లోని కార్బన్ డయాక్సెడ్ ను  నాచు పీల్చుకున్నప్పుడు.. ..చుట్టూ ఉన్న గాలిలోంచి తిరిగి కార్బన్ డయాక్సైడ్ ఆ నీటిలోకి చేరుతుంది. దీని వల్ల గాలిలో కాలుష్యం తగ్గుతుంది. 

ఎక్కడ ఉంది లిక్విడ్ ట్రీ...

సెర్బియాలోని బెల్ గ్రేడ్ లో మున్సిపాలిటీ ఆఫీసు ముందు మొట్టమొదటి లిక్విడ్ 3 ట్యాంకును ఏర్పాటు చేశారు. దీనిని భూమి నుంచి కొద్దిగా లోతుగా ఏర్పాటు చేశారు. ఇది కూర్చునే బెంచ్ లా ఏర్పాటు చేశారు. పైన సోలార్ ప్యానల్ తో నీడగా అమర్చారు. ఆ ప్యానెోల్ నుంచి వచ్చే విద్యుత్ తోనే ట్యాంకులో బల్బు వెలుగుతుంది. వీటి ద్వారా మొబైల్ ఫోన్లు చార్జింగ్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది.