ఆదర్శ దంపతులు.. సిగరెట్ షేరింగ్ చేసుకుంటూ..

ఆదర్శ దంపతులు.. సిగరెట్ షేరింగ్ చేసుకుంటూ..

పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం ఇది అన్ని పెట్టెలపై ఉంటుంది.. అదే దమ్ము కొట్టనోడు దున్నపోతు అయ్యి పుంటెన్ అని కవులు అంటారు.. కాలంతోపాటు అభిప్రాయాలు మారుతున్నట్లు.. సిగరెట్ విషయంలో భార్యభర్తల మధ్య గట్టి అండర్ స్టాండింగ్ వస్తుంది. ఇప్పటికే ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది అమ్మాయిలు.. అబ్బాయిలు సిగరెట్ షేరింగ్ చేసుకోవటం కామన్.. ఈ వార్త మాత్రం అందుకు కొంచెం భిన్నం.. అదెలాగో చూద్దాం...

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో.. ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోలో చీర కట్టులో ఉన్న ఓ మహిళ, ఆ పక్కనే స్కూటీపై కూర్చున్న ఓ వ్యక్తి ఉన్నారు. అందులో ఆశ్చర్యం గానీ, చెప్పుకోదగింది గానీ ఏమీ లేదు. మామూలుగా అయితే వారి గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఈ వీడియోలో ఉన్న స్త్రీ సిగరెట్ తాగుతూ కనిపించింది. అలా కొంచెం సేపు తాగాక, దాన్ని ఆ పక్కనే ఉన్న వ్యక్తికి ఇవ్వడంతో అతను కూడా సిగరెట్ తాగుతూ డ్రైవ్ చేయడానికి సిద్ధమవుతూ ఉంటాడు. వీరిద్దరూ ఒకరికొకరు ఏమవుతారన్న దానిపై స్పష్టత లేదు. కానీ ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది వారిద్దరూ భార్యాభర్తలేనంటూ కామెంట్ చేస్తున్నారు. 

సిగరెట్ తాగడం సాధారణమైన విషయమే అయినా.. ఇలా ఒకరికొరు షేర్ చేసుకోవడం వీక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోను ఆ పక్కనే ఉన్న ఓ బాల్కనీ నుంచి రికార్డు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియోలో ఉన్న స్త్రీ ఆకుపచ్చ రంగులో ఉన్న చీరను ధరించగా, స్కూటీపై కూర్చున్న వ్యక్తి నీలిరంగు సూట్ లో చూడడానికి సంప్రదాయంగా కనిపిస్తున్నారు. ఈ వీడియోకు వేలల్లో వ్యూస్, లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు పోటాపోటీగా కామెంట్లు పెడుతున్నారు.

https://twitter.com/ajaychauhan41/status/1642886785947582470