వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఆగస్టు నెల సగటు ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమైన పనులు విజయవంతమవుతాయి. భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉందని పండితులు చెబుతున్నారు.
ఆగస్టు నెల గురుడి సంచారం వలన వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం పెరుగుతుంది. వ్యాపారులు మరింత శ్రమిస్తే ఆశించిన ఫలితాలు సాధించగలరు. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది.
కొద్ది శ్రమతో ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని, పెండింగ్ పనుల్ని చక్కబెడతారు. స్వల్ప అనారోగ్యం ఉన్నా లెక్క చేయకుండా ఇంటా బయటా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉద్యోగంలో పని తీరుతో అధికారులను ఆకట్టుకుంటారు.రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలను పట్టుదలగా వసూలు చేస్తారు.
ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహక రిస్తారు. అదనపు ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు కూడా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. నిరుద్యో గులకు మంచి ఉద్యోగావకాశాలు అందివస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు
కుటుంబ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ల విఝయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని పండితులు చెబుతున్నారు . వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరు గుతుంది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం లచాలా మంచిది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చులు తగ్గించుకోవలం చాలా అవసరమని గ్రహాల సంచారం ఆధారంగా తెలుస్తుందని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు.విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగు తాయి. నిరుద్యోగులు తగిన ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
పరిహారం: నీటిలో నివసించే జంతువులకు ఆహారం ఇవ్వాలి.. బుధవారం వినాయకుడిని గరికతో పూజించాలి.. లడ్డూలను ప్రసాదంగా పంచిపెట్టండి
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
