కొత్తగా 12 ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 కొత్తగా 12 ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:  దాదాపు 12 కంపెనీల ఐపీఓలకు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ అనుమతులు ఇచ్చింది.  ఈ జాబితాలో హెల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రా మార్కెట్, పర్పుల్ స్టైల్ ల్యాబ్స్, జయ జగదంబ లిమిటెడ్, యూకేబీ ఎలక్ట్రానిక్స్, సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్, ట్రాన్స్​లైన్ టెక్నాలజీస్, మెడిక్యాప్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్, ఓస్వాల్ కేబుల్స్, బీవీజీ ఇండియా, సాయి పారెంటరల్స్, కామ్​టెల్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్స్ , సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ ఉన్నాయి. ఈ సంస్థలు గత సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ మధ్య తమ ఐపీఓ పత్రాలను సమర్పించగా, సెబీ ఈ నెల 19 నుంచి 23 మధ్య అబ్జర్వేషన్​ లెటర్లు ఇచ్చింది. 

హెల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రా మార్కెట్ రూ.4,500 నుంచి రూ.5,500 కోట్ల మధ్య నిధులు సేకరించాలని చూస్తోంది.  ఈ కంపెనీ ఐపీఓలో ఫ్రెష్​ షేర్ల ఇష్యూతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  ఉన్నాయి. 

సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ రూ.2,500 కోట్ల విలువైన ఫ్రెష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్లను, రూ.1,200 కోట్ల విలువైన షేర్లను ఓఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా విక్రయించనుంది.   

పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ పూర్తిగా ఫ్రెష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్ల ఇష్యూ ద్వారా రూ.660 కోట్లు సమీకరించాలని కోరుకుంటోంది.

ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ టెక్నాలజీస్ మాత్రం పూర్తిగా 1.62 కోట్ల షేర్లను ఓఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ రూపంలో అమ్మనుంది.  సాయి పారెంటరల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐపీఓ మొత్తం సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుమారు రూ.425 కోట్లు. ఇందులో రూ.285 కోట్ల ఫ్రెష్ షేర్ల ఇష్యూ, 35 లక్షల షేర్ల ఓఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఉన్నాయి.

యూకేబీ ఎలక్ట్రానిక్స్ రూ.400 కోట్లను ఫ్రెష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్ల ఇష్యూ ద్వారా, మరో రూ.400 కోట్ల ఓఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా సేకరించనుంది.  సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రీన్ టెక్నాలజీస్ 4.28 కోట్ల షేర్లను ఓఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ రూపంలో విక్రయించనుంది. 

ఓస్వాల్ కేబుల్స్ రూ.300 కోట్లను  ఫ్రెష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్ల ఇష్యూతో సేకరించనుండగా,  2.22 కోట్ల షేర్లను ఓఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపంలో అమ్మనుంది. ఐపీఓ ద్వారా సేకరించిన ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  కొత్త ప్రాజెక్టులు, అప్పుల చెల్లింపులు, సాధారణ అవసరాలకు వినియోగించనుంది.

బీవీజీ ఇండియా రూ.300 కోట్ల విలువైన ఫ్రెష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్లను, 2.85 కోట్ల  ఓఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ షేర్లను  విక్రయించనుంది.  కామ్‌‌‌‌‌‌‌‌టెల్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్స్ రూ.900 కోట్ల ఐపీఓలో రూ.150 కోట్ల ఫ్రెష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్ల ఇష్యూ, రూ.750 కోట్ల ఓఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ కలిసి ఉన్నాయి.