ఐదు ఐపీఓలకు సెబీ గ్రీన్​ సిగ్నల్​ .. ఎస్​కే ఫైనాన్స్ ఇష్యూకు బ్రేక్​

ఐదు ఐపీఓలకు సెబీ గ్రీన్​ సిగ్నల్​ .. ఎస్​కే ఫైనాన్స్ ఇష్యూకు బ్రేక్​

న్యూఢిల్లీ: ఫ్లిప్​కార్ట్​ మద్దతు గల జింకా లాగిస్టిక్స్​తోపాటు అకుమ్స్ డ్రగ్స్ , సీగల్ ఇండియా, ఓరియంట్ టెక్నాలజీస్,  గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీల ఇనీషియల్​ పబ్లిక్​ ఆఫర్లకు (ఐపీఓ)  సెబీ ఆమోదం తెలిపింది.    నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎస్​కే ఫైనాన్స్  రూ.2,200 కోట్ల పబ్లిక్ ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలిపివేసింది. కంపెనీ లేదా ఇతర నియంత్రణ సంస్థల నుంచి కోరిన సమాచారం సకాలంలో అందకపోతే సెబీ ఐపీఓని హోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచుతుంది. అకుమ్స్ డ్రగ్స్ తాజా ఇష్యూ ద్వారా రూ. 680 కోట్లకు పైగా సమీకరించాలని యోచిస్తోంది.

ఆఫర్​ఫర్​సేల్​( ఓఎఫ్​ఎస్) ద్వారా ప్రమోటర్లు  18.6 మిలియన్ షేర్లు అమ్ముతారు. తాజా ఇష్యూతో వచ్చే ఆదాయాన్ని అప్పులు తీర్చడం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వాడతారు. లూథియానాకు చెందిన ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ సీగల్ ఇండియా, తాజా ఇష్యూ ద్వారా రూ. 618 కోట్లు సేకరించనుంది. ఓఎఫ్​ఎస్ ద్వారా  ప్రమోటర్లు 14.3 మిలియన్ల షేర్లను అమ్ముతారు. ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ ఇన్వెస్ట్-బ్యాక్డ్ గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీ ఐపీఓ 15.7 మిలియన్ షేర్ల ఓఎఫ్​ఎస్​ ద్వారా రూ. 500 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఓరియంట్ టెక్నాలజీస్  పబ్లిక్ ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 120 కోట్ల విలువైన తాజా ఇష్యూతోపాటు 4.6 మిలియన్ల వరకు ఈక్విటీ షేర్ల ఓఎఫ్​ఎస్​ ఉంటుంది.  ఫ్రెష్​ఇష్యూ నుంచి వచ్చిన దాంట్లో దాదాపు రూ. 79 కోట్లు మూలధన వ్యయం కోసం,  రూ. 10.35 కోట్లు నవీ ముంబైలోని ఆఫీసు కొనడం కోసం వాడుతారు.