చదలవాడ శ్రీనివాసరావు దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. సత్య కృష్ణ , సంజన, నిహార్, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘మళ్లీ పుట్టి వచ్చినవా’ అని సాగే ఈ పాటకి సాబు వర్గీస్ మ్యూజిక్ అందించగా వరికుప్పల యాదగిరి లిరిక్స్ రాయడంతో పాటు తనే స్వయంగా పాడాడు.
ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించినా.. నాకున్న అనుభవంతో సొసైటీకి ఉపయోగపడే మంచి కథను డైరెక్ట్ చేయాలనుకున్నా. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్‌గా అన్ని భాషల్లోనూ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’ అని అన్నారు.
