సిటీలో నామ్‌ధారిస్ రిటైల్ స్టోర్‌‌

సిటీలో నామ్‌ధారిస్ రిటైల్ స్టోర్‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : విత్తనాల కంపెనీ నామ్‌‌ధారిస్‌‌ గ్రూప్ హైదరాబాద్‌‌లో తమ మొదటి రిటైల్ స్టోర్‌‌‌‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే బెంగళూరులో 30 స్టోర్లను ఆపరేట్​ చేస్తున్న ఈ గ్రూప్ సబ్సిడరీ సింప్లి నామ్‌‌ధారిస్‌‌, హైదరాబాద్‌‌లో మరో 18 నెలల్లో 3–5 స్టోర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. తాజాగా ప్రారంభించిన స్టోర్‌‌‌‌ 11,000 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది.

ఇక్కడ పండ్లు, కూరగాయలతో పాటు పర్సనల్ కేర్ ప్రొడక్ట్‌‌లు, శ్నాక్స్‌‌ ఐటెమ్స్‌‌ కూడా అమ్ముతున్నారు. తమ రెవెన్యూని వచ్చే 24 నెలల్లో రూ.30–50 కోట్లకు పెంచుకుంటామని కంపెనీ సీఈఓ గుర్ముక్‌‌ రూప్రా అన్నారు. తమ స్టోర్లలో అమ్మే మెజార్టీ ప్రొడక్ట్‌‌లు తాము తయారు చేసినవేనని పేర్కొన్నారు. పండ్లు, కూరగాయలను సొంతంగా పెంచుతున్నామని, రైతులతో భాగస్వామ్యం అయ్యి కూడా పండిస్తున్నామని చెప్పారు.