
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఈఐఎల్ ఎనర్జీ ఇండియా, 2025 సంవత్సరానికి గాను 'గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్'ను గెలుచుకుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) ఈ అవార్డును ప్రకటించింది. కార్పొరేట్ పాలనలో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నందుకు ఈ గౌరవం దక్కింది.
ఈ గుర్తింపు విశ్వసనీయత, వాటాదారుల విలువ కోసం కంపెనీ చేస్తున్న నిరంతర కృషికి నిదర్శనమని ఎస్ఈఐఎల్ సీఈఓ జనమేజయ మహాపాత్ర అన్నారు. తమ అంకితభావాన్ని గుర్తించి ఈ అవార్డును అందుకోవడం గౌరవంగా ఉందని అన్నారు. లండన్లో వచ్చే నెల జరిగే ఐఓడీ ఇండియా వార్షిక గ్లోబల్ కన్వెన్షన్లో ఈ అవార్డును కంపెనీ సీఈఓకి
అందిస్తారు.