స్వయం ఉపాధికే ఓటేస్తున్న యువత

స్వయం ఉపాధికే ఓటేస్తున్న యువత

స్వయం ఉపాధి వైపు వెళ్తున్న యువతలో ఎక్కువ మంది చేపడుతున్నది చిన్న చిన్న వ్యాపారాలే.అయితే,అందులోనే వారు ఆత్మసంతృప్తిని వెతుక్కుంటున్నారు . తమకు తెలిసిన సాంకేతికతను జోడించి అద్భుతాలు సృష్టిస్తున్నారు . బీటెక్‌‌ చదివిన వినోద్‌‌.. తన తండ్రి హేర్‌‌‌‌ సెలూన్‌‌ను మెన్స్‌ పార్లర్ గా తీర్చిదిద్దాడు. కరీం నగర్‌‌‌‌లోని మంచిర్యాల చౌరస్తాలో ఆధునిక సౌకర్యాలతో తమ కుల వృత్తినే వ్యాపారంగా నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్‌‌లో తాను చేస్తు న్న ప్రైవేటు ఉద్యోగాన్ని వదిలిన కె.నరేశ్..తన సొం త ఊరు పెద్దపల్లిలో రెడిమేడ్‌‌ ఫ్యాషన్‌‌ స్టోర్‌‌‌‌ ప్రారంభించాడు. తాను సంపాదించి న మొత్తంతో అక్కడే మరో షాప్ ప్రారంభించి బిజెనెస్‌‌ విస్తరించాడు. సదాశి వపేట పట్టణానికి చెందిన రమాకాంత్,సాఫ్ట్​వేర్ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం బాటపట్టాడు. రెండేంళ్లలోనే కూరగాయల సాగులో లాభాలు గడించాడు. కరీంనగర్‌‌ జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్‌‌ గ్రామానికి చెందిన కట్ల శ్రీనివాస్‌‌ హైదరాబాద్‌‌లో ఎంబీఏ చేశాడు. ముంబైలో సాఫ్ట్‌‌వేర్‌‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించా డు. ఆత్మసంతృప్తిని వెతుక్కుంటూ సొంతూరుకు వచ్చి వ్యవసాయం చేస్తున్నాడు. వేల మంది యువకులు వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలూ ఇందుకు దోహదం చేస్తు న్నాయి. తెలంగాణలోని 52 లక్షల మంది రైతుల్లో .. దాదా పు 10 లక్షల మంది 35 ఏండ్లకంటే తక్కువ వయసువారే ఉన్నారు.. గ్రామీణ యువత ఎక్కువగా వ్యవసాయం, ఇంటర్నెట్ సెంటర్లు, మీసేవల వైపు మొగ్గు చూపుతుండగా.. పట్టణాలు, నగరాల్లో సెల్ ఫోన్‌‌  రిపేరిం గ్ షాపులు , మొబైల్‌‌ యాక్సెసరీస్‌‌ అమ్మకం, క్లాత్‌‌ స్టోర్స్‌‌, క్యాబులు, హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌‌ సెం టర్లు ప్రారంభిస్తున్నారు . ఒక్క హైదరాబాద్‌‌లోనే దాదా పు 3500 మంది యువకులు మొబైల్‌‌ యాక్సెసరీస్‌‌ బిజినెస్‌‌ చేస్తు న్నారు . రాష్ట్రవ్యా ప్తంగా ఈ సంఖ్య 8 వేల వరకు ఉంటుంది. వీరిలో 70 శాతం మంది డిగ్రీలు పూర్తిచేసినవారే. రాష్ట్రవ్యా ప్తంగా మేజర్ గ్రామపంచాయతీల నుంచి పట్టణాలు, నగరాల దాకా ప్రస్తుత ట్రెండ్స్‌‌కు అనుగుణంగా క్లాత్‌‌, రెడిమేడ్‌‌ స్టోర్స్‌‌ నిర్వహిస్తు న్నవారిలో అధికంగా యువతే ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం మంది యువత స్వయం ఉపాధిపైనే ఆధారపడుతోం దని ఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌వో నివేదిక స్పష్టం జేసింది.

కొన్నాళ్లుగా ఇంటర్నెట్‌‌ వినియోగం విపరీతంగా పెరిగింది. ఫేస్‌‌బుక్‌‌, యూట్యూబ్‌‌, వాట్సప్‌‌ వంటి సోషల్ మీడియా యాప్‌‌లకు ఉన్న క్రేజ్‌‌ను యువత తమకు అనుకూలంగా మలుచుకుంటోం ది. వినూత్నంగా ఆలోచిస్తూ.. ఆన్ లైన్ లో మార్కెటిం గ్ నిర్వహిస్తోంది. కొందరు వాట్సప్‌‌లో, ఫేస్ బుక్ లో గ్రూపులు ఏర్పాటుజేసి బట్టలు, యాక్సె సరీస్, ఇతర వస్తు వులు సేల్‌‌ చేస్తు న్నారు . రాష్ట్రంలో దాదా పు గ్రామానికో యువతి ఇలా వాట్సప్‌‌లో తమ వ్యాపారాన్ని నిర్వహిస్తు న్నారంటే నమ్మలేని నిజం. ఇక.. బీటెక్‌‌, ఎంటెక్‌‌ చేసిన యువకులు కొత్త కొత్త టెక్నాలజీల గురించి వివరిస్తూ చేసిన వీడియోలను యూట్యూబ్‌‌లో పెడుతూ చేతినిండా సంపాదించేస్తున్నారు .