ఓటీటీలు, వెబ్‌సైట్ల కంట్రోల్‌కు చట్టం?
న్యూస్ వెబ్‌సైట్లను కూడా
డిజిటల్ మీడియా కోసం ఓ సెల్ఫ్ రెగ్యులేటరీ
న్యూఢిల్లీ: ఓటీటీలు, ఆన్‌లైన్ న్యూస్ వెబ్‌సైట్లను కంట్రోల్ చేసేందుకు ఓ సెల్ఫ్ రెగ్యులేటరీ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఓ చట్టాన్ని తీసుకురావాలని చూస్తోంది. ప్రస్తుతం ప్రింట్ మీడియాను కంట్రోల్ చేసేందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సినిమాలను కంట్రోల్ చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌లు పనిచేస్తున్నాయి. అలానే టీవీ ఛానెల్స్‌ను అదుపులో ఉంచేందుకు కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ రెగ్యులేషన్ చట్టం ఉంది. కానీ డిజిటల్ మీడియాను కంట్రోల్ చేయడానికి ఎటువంటి చట్టాలు లేవు. డిజిటల్ మీడియాపై కస్టమర్లు చేసే ఫిర్యాదులను పరిష్కరించేందుకు సెల్ఫ్ రెగ్యులేటరీని అందించే చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది. ప్రస్తుతం దేశంలో 40 కి పైగా ఓవర్ ది టాప్(ఓటీటీ)లు ఉన్నాయి. ఇందులో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ వంటి మల్టీనేషనల్ ఓటీటీలు కూడా ఉన్నాయి. అలానే దేశంలో 100 కి పైగా న్యూస్ కంటెంట్ వెబ్‌సైట్‌లూ పనిచేస్తున్నాయి. ఓటీటీలలో లాంగ్వేజ్, వీడియో కంటెంట్‌లపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులొస్తున్నాయని ఐ అండ్ బీ మినిస్ట్రీ అధికారులు చెప్పారు. డిజిటల్ వెబ్‌సైట్‌లలో ఫేక్ న్యూస్‌ను కట్టడి చేసేందుకు, యూజర్ల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఓ సెల్ఫ్ రెగ్యులేటరీ అవసరమని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
రూ. 1000 కోట్ల ఓటీటీ మార్కెట్..
ప్రస్తుతం ఇండియాలో ఓటీటీ మార్కెట్ రూ. 1,000 కోట్లకు చేరుకుంది. సుమారుగా 20 కోట్లకు పైగా యూజర్లు ఓటీటీలను వాడుతున్నారు. కొన్ని ఓటీ టీలు సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో పనిచేస్తున్నప్పటికీ చాలా వరకు ప్లాట్‌ఫామ్‌లు యూజర్లకు ఫ్రీగా యాక్సెస్ కల్పిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకురానున్న చట్టం వలన డిజిటల్ మీడియా ఫ్రీడమ్‌కు ఎటువంటి భంగం కలగదని పేర్కొన్నారు. ఈ చట్టం కోసం ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్‌తో కలిసి ఐ అండ్ బీ మినిస్ట్రీ పనిచేస్తుందని చెప్పారు. ఈ అసోసియేషన్ ప్రపోజ్ చేసిన సెల్ఫ్ రెగ్యులేటింగ్ మెకానిజం ఎక్కువగా ఓటీటీలకు అనుకూలంగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా ప్రింట్, కేబుల్ మీడియాకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించేందుకు చట్టాలున్నప్పటికీ, డిజిటల్ మీడియాను కంట్రోల్ చేసే చట్టాలేవి లేకపోవడం కూడా పరిగణనలలోకి తీసుకొంటోంది.
For More News..
బ్యాడ్ బ్యాంకుల ఏర్పాటును పరిశీలిస్తాం
ఫేస్ స్కాన్ చేసి దొంగల్ని పట్టేస్తున్నరు
మేయర్ సీటు కోసం లీడర్ల బిడ్డలు, కోడళ్ల లాబీయింగ్
