కారణం ఇదీ : స్టాక్ మార్కెట్ లో మధ్య తరగతి మటాష్.. రూ.9 లక్షల కోట్లు ఆవిరి

కారణం ఇదీ : స్టాక్ మార్కెట్ లో మధ్య తరగతి మటాష్.. రూ.9 లక్షల కోట్లు ఆవిరి

స్టాక్ మార్కెట్.. ఎప్పుడు.. ఎందుకు పెరుగుతుందో.. ఎప్పుడు ఎందుకు పడిపోతుందో ఎవరూ ఊహించలేరు.. నిన్నా మొన్నటి వరకు ఓ రకంగా పెరుగుతూ వచ్చినా.. మార్కెట్..డిసెంబర్ 20వ తేదీ మాత్రం పడటంలోనూ రికార్డ్ బ్రేక్ చేసింది. అక్టోబర్ తర్వాత.. అత్యంత దారుణంగా పడిపోయింది. బుధవారం ఒక్క రోజే.. సెన్సెక్స్ 930 పాయింట్లు, నిఫ్టీ 302 పాయింట్లు పడ్డాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 425 పాయింట్లు డౌన్ అయ్యింది. ఇక మధ్య తరగతి జనం.. ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే మిడ్ క్యాప్ షేర్లు అయితే అత్యంత దారుణంగా పతనం అయ్యాయి.. ఏకంగా వెయ్యి 487 పాయింట్లు పడిపోయి జనం దగ్గర ఉన్న లక్షల కోట్ల డబ్బును మాయం చేసింది స్టాక్ మార్కెట్..

మిడ్ క్యాప్ షేర్లలో పతనంతోపాటు.. ఓవరాల్ మార్కెట్ ఢమాల్ కావటంతో.. డిసెంబర్ 20వ తేదీ ఒక్క రోజే అక్షరాల 9 లక్షల రూపాయల జనం డబ్బు మాయం అయ్యింది. ఇన్వెస్టర్ల అకౌంట్ల నుంచి కరిగిపోయింది. మార్నింగ్ స్టాక్ మార్కెట్ ప్రారంభంలో మిడ్ క్యాప్ షేర్లలో ర్యాలీ నడిచింది.. అన్ని షేర్లు గ్రీన్ లో ట్రేడ్ అయ్యాయి.. మంచి లాభాల్లో ఉన్నారు ఇన్వెస్టర్లు.. సడన్ గా.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత.. షేర్లు పడటం ప్రారంభం అయ్యాయి.. అది ఏకంగా 3.27 శాతంగా ఉంది. 

డిసెంబర్ 20వ తేదీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటీ అంటే.. 25 వేల పెట్టుబడి పెట్టినోళ్లు.. కనీసంలో కనీసం సరాసరి వెయ్యి రూపాయల వరకు నష్టపోయాడు.. కొన్ని షేర్లు భారీగా పతనం కావటంతో.. మొత్తం 9 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి అయ్యింది. 

ఇంతలా స్టాక్ మార్కెట్ పడిపోవటానికి కారణం ఏంటో తెలుసా.. విదేశీ పెట్టుబడులు 600 కోట్లను మన మార్కెట్ నుంచి విత్ డ్రా చేసుకున్నారు. మరో కారణం కారోనా కేసులు ఇండియాలో పెరగటం.. మూడో కారణం.. క్రూడ్ ఆయిల్ ధరలను కంపెనీలు పెంచటం.. ఈ మూడు కారణాల వల్లే స్టాక్ మార్కెట్ ఢమాల్ అయ్యింది..