నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వారం తొలి ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా ఉండటం, రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ భయాలు ట్రేడింగ్పై ప్రభావం చూపాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నానికి కోలుకున్నట్లు కనిపించినా ఆ తర్వాత తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో 57,57,551.65 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. అమ్మకాల ఒత్తిడితో నమోదైన 57,167.02పాయింట్లు కనిష్ఠ స్థాయి. మిడ్ సెషన్ అనంతరం కాస్త కోలుకుని 58,141.96 గరిష్ఠ స్థాయిని నమోదుచేసిన సెన్సెక్స్.. మార్కెట్ ముగిసే సమయానికి 149.38 పాయింట్ల లాస్తో 57,683.59 వద్ద క్లోజయింది. హెచ్సీఎల్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ  69.60 పాయింట్ల లాస్తో17,206.70 వద్ద క్లోజయింది.

మరిన్ని వార్తల కోసం..

సంగమేశ్వర, బసవేశ్వరప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన

కేసీఆర్ ముంబై పర్యటన ఓ డ్రామా