నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు

నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ఆరంభంలో లాభాలార్జించిన మార్కెట్లు ఆ తర్వాత నష్టాలబాట పట్టాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరలు గరిష్ఠానికి చేరడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రభావితం చేసింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు సిద్ధపడటంతో మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాస్తో 55,145 వద్ద ట్రేడవుతోంది. అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, హిందూస్థాన్ యూనిలీవర్, మారుతి షేర్లు నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 85పాయింట్లకుపైగా నష్టంతో 16,519 వద్ద ట్రేడవుతోంది. 

మరిన్ని వార్తల కోసం..

ఉచిత కరెంట్ గుజరాత్ లో ఎందుకివ్వడం లేదు?

కుట్ర వెనక ఉన్న అన్ని విషయాలను బయటపెడతాం