స్టాక్ మార్కెట్ రక్త కన్నీరు.. భారీగా పడిన షేర్లు

స్టాక్ మార్కెట్ రక్త కన్నీరు.. భారీగా పడిన షేర్లు

స్టాక్ మార్కెట్ ఢమాల్ అయ్యింది. ఎప్పుడు ఎందుకు పెరుగుతుందో తెలియదు.. ఎప్పుడు ఎందుకు పడిపోతుందో  అర్థం కావటం లేదు. 75 వేల పాయింట్లు దాటిందని సంబురాలు చేసుకున్న 24 గంటల్లోనే భారీగా పతనం అయ్యింది. 2024, ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం నష్టాలతోనే ప్రారంభం అయిన మార్కెట్లు.. ఏ దశలోనూ కోలుకోలేదు.. మరింత దిగజారుతూ ఇన్వెస్టర్లను నష్టాల్లోకి నెట్టాయి..

సెన్సెక్స్ 793 పాయింట్లు నష్టపోయి.. 74 వేల 244 దగ్గర క్లోజ్ అయ్యింది. గత ట్రేడింగ్ తో పోల్చితే ఒకటి పాయింట్ 6 శాతం నష్టపోయింది. ఇక నిఫ్టీ అయితే 234 పాయింట్లు నష్టపోయి.. 22 వేల 519 పాయింట్ల దగ్గర క్లోజ్ అయ్యింది. గత ట్రేడింగ్ తో పోల్చితే ఒకటి పాయింట్ 3శాతం నష్టాలను చవిచూసింది.

సెన్సెక్స్ లో టాటా మోటార్స్, టీసీఎస్, నెస్లే లాభపడగా.. సన్ ఫార్మా, మారుతీ, పవర్ గ్రిడ్ షేర్లు భారీగా నష్టపోయాయి.
నిఫ్టీ విషయానికి వస్తే బజాజ్ ఆటో, నెస్లే బాగా లాభపడగా.. ONGC, సన్ ఫార్మా, టైటాన్ భారీగా పడిపోయాయి.

బ్యాంక్ నిఫ్టీ సైతం 232 పాయింట్లు నష్టపోయి.. 48 వేల 754 దగ్గర క్లోజ్ అయ్యింది.

ఇండియన్ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీగా పతనం కావటానికి పలు కారణాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పెట్టుబడిదారులు అందరూ తమ షేర్లను అమ్మేశారు. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు అయిన జపాన్ నిక్కీ లాభాల్లో ముగిస్తే.. హాంకాంగ్, సౌత్ కొరియా మార్కెట్లు బాగా నష్టపోయాయి. అదే విధంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగనున్నాయనే వార్తలతో మార్కెట్లను ప్రభావితం చేసింది.