నేటి నుంచి సిరీస్ ఎక్స్ గోల్డ్​బాండ్లు

నేటి నుంచి సిరీస్ ఎక్స్ గోల్డ్​బాండ్లు

న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) 2021-–22 - సిరీస్ ఎక్స్ స్కీమ్  ఫిబ్రవరి 28, 2022 నుండి మార్చి 4, 2022 వరకు సబ్‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది. ఎస్జీబీ సిరీస్ 10 ధరను ఆర్బీఐ గ్రాముకు రూ. 5,109గా నిర్ణయించింది.  పెట్టుబడిదారులు ఎస్జీబీ స్కీమ్ - సిరీస్ ఎక్స్ గురించి తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవి
 

సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ?
సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ప్రభుత్వం నవంబర్ 2015లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద ప్రారంభించింది. ఈ పథకం కింద ఆర్బీఐ ద్వారా విడతల వారీగా సబ్‌‌‌‌స్క్రిప్షన్ కోసం ఇష్యూలు అందుబాటులో ఉంటాయి.  ఎస్జీబీలు బంగారంతో రూపొందించిన ప్రభుత్వ సెక్యూరిటీలు. భౌతిక బంగారాన్ని బదులు పేపర్​ గోల్డ్​ పెట్టుబడి పెట్టడం అన్నమాట! పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి.  మెచ్యూరిటీపై బాండ్లు నగదు రూపంలో రీడీమ్ అవుతాయి. 
 

ఎస్జీబీ సిరీస్ ఎక్స్ ధర
బాండ్ సబ్‌‌‌‌స్క్రిప్షన్​కు ముందు వారంలోని చివరి మూడు పనిదినాలలో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (ఐబీజేఏ) పేర్కొన్న సాధారణ సగటు ముగింపు ధర  ఆధారంగా ధరను నిర్ణయిస్తారు. అంటే ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 24,  ఫిబ్రవరి 25, 2022 నాటికి గ్రాము బంగారం ధర రూ. 5,109. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేసుకున్న పెట్టుబడిదారులకు నామమాత్రపు విలువ కంటే గ్రాముకు రూ. 50 తగ్గింపును అందించాలని నిర్ణయించింది.  ఇందుకోసం ఆన్​లైన్​లో డబ్బు చెల్లించాలి. ఇటువంటి పెట్టుబడిదారులకు, గోల్డ్ బాండ్  ఇష్యూ ధర గ్రాము బంగారంపై రూ. 5,059గా ఉంటుంది. 

వడ్డీ రేట్లు...
ఎస్జీబీలలో ప్రారంభ పెట్టుబడి మొత్తంపై సంవత్సరానికి 2.50 శాతం (స్థిర రేటు) చొప్పున వడ్డీని చెల్లిస్తారు. ఆర్నెళ్లకు ఒకసారి వడ్డీ జమ అవుతుంది. చివరిని వడ్డీ అసలుతో పాటు మెచ్యూరిటీ తరువాత చెల్లిస్తారు.  వ్యక్తులతోపాటు హిందూ యునైటెడ్ ఫ్యామిలీలు (హెచ్యూఎఫ్లు) , ట్రస్టులు, యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థలు సావరిన్ గోల్డ్ బాండ్లను కొనొచ్చు.