గురుకులాలకు సెట్​ నోటిఫికేషన్​ రిలీజ్​

గురుకులాలకు సెట్​ నోటిఫికేషన్​ రిలీజ్​

గురుకులాల్లో అయిదో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ గురుకుల సెట్​ నోటిఫికేషన్​ రిలీజ్​ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 602 గురుకులాల్లో 46,937 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాలుగో తరగతి పూర్తి చేసిన స్టూడెంట్స్​ కామన్​ ఎంట్రెన్స్​ టెస్ట్​ ద్వారా అడ్మిషన్​ పొందవచ్చు. 

రాష్ట్రంలో ఆర్థికంగా వెనకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్​ కోసం ప్రభుత్వం వందల సంఖ్యలో గురుకులాలను ప్రారంభించింది. ఇంగ్లిష్​ మీడియంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం​తోపాటు ఫుడ్​, అకామిడేషన్ ఇస్తుండటంతో గురుకుల ప్రవేశాలకు ఏటా పోటీ పెరుగుతోంది. గతేడాది 48,120 సీట్లకు 1,48,168 మంది పోటీ పడ్డారు. ప్రస్తుతం 2021–22 అకడమిక్​ ఇయర్​ ప్రవేశాలకు అప్లికేషన్​ ప్రాసెస్​ ప్రారంభమైంది. 

అర్హతలు
ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న స్టూడెంట్స్​ అర్హులు. బీసీ, ఓసీ స్టూడెంట్స్​ 9 నుంచి 11 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్​కు మూడేళ్ల ఏజ్​ రిలాక్సేషన్​ ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో రూ. రెండు లక్షల కంటే మించరాదు.

సెలెక్షన్​ ప్రాసెస్​
కామన్​ ఎంట్రెన్స్​ టెస్ట్​ ద్వారా అడ్మిషన్స్​ కల్పిస్తారు. ఇందుకు పాత జిల్లాను యూనిట్​గా పరిగణిస్తారు. మెదక్​ జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇన్​స్టిట్యూషన్స్​ సొసైటీ కౌడిపల్లి స్కూలులో మాత్రం మత్స్యకార వృత్తికి చెందిన తెలంగాణలోని అన్ని జిల్లాల వారు అర్హులు. నల్గొండ జిల్లా సర్వేల్​ రీజనల్​ సెంటర్​ ఆఫ్​ ఎక్స్​లెన్స్​ స్కూలులో ప్రవేశాలకు తెలంగాణలోని అన్ని జిల్లాల వారు అర్హులు. అభ్యర్థి మెరిట్​, రిజర్వేషన్​ ప్రకారం అడ్మిషన్​ కల్పిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్​కు సమాన మార్కులు వచ్చినప్పుడు డేట్​ ఆఫ్​ బర్త్, మ్యాథ్స్, ఈవీఎస్​లో వచ్చిన మార్క్స్​ పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు.

సబ్జెక్ట్​ ప్రిపరేషన్
తెలుగు: అక్షరమాల, అచ్చులు, హల్లులు మొదలు రీడింగ్​ ప్యాసేజీ వరకు మాతృభాషపై కొంత శ్రద్ధ పెడితే ఎక్కువ మార్కులు స్కోర్​ చేయొచ్చు.  మూడు, నాలుగో తరగతుల్లోని తెలుగులో కాలాలు(భూత, వర్తమాన, భవిష్యత్​), తెలుగు మాసాలు, తిథులు, పండుగలు, నదులు, తేలికపాటి పద్యపూరణం, జంటపదాలు, అర్థాలు, వ్యతిరేక అర్థాలు, నానార్థాలు, భాషాభాగాలు, ప్యాసేజీ రీడింగ్​ మీద ఎక్కువ ప్రశ్నలు ఇస్తున్నారు.
ఇంగ్లిష్​: టెస్ట్​లో ఇంగ్లిష్​కు అత్యధికంగా 25 మార్కులు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ కాన్సన్​ట్రేషన్​ చేయాలి. ఇంగ్లిష్​ వకాబులరి పెంచుకోవడంతోపాటు, సింగ్లర్​, ప్లూరల్స్​, కంజక్షన్స్​, ప్రిపోజిషన్స్, వర్డ్స్​ అరేంజ్​మెంట్​, టెన్సెస్​, ప్యాసేజ్​ రీడింగ్, మిస్సింగ్​ లెటర్స్​​, రాంగ్లీ స్పెల్ట్​ వర్డ్స్​, ఎనిమల్స్​ వాటి పిల్లల పేర్లు, నౌన్​, ప్రనౌన్​ తదితర పార్ట్స్​ ఆఫ్​ స్పీచ్​ 
చాప్టర్స్​ ప్రిపేరవ్వాలి.
మ్యాథ్స్​: అంకెలు–సంఖ్యలు, సంఖ్యల స్థాన విలువ, ముఖ విలువ, కొలతలు, ఆరోహణ, అవరోహణ క్రమాలు, పూర్ణసంఖ్యలు, భిన్నాలు, కాలం, త్రిభుజాలు, ఘనాలు తదితర చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలిస్తున్నారు. మ్యాథ్స్​లో కూడా 25 మార్కులు ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్​ మూడు, నాలుగు తరగతిల మ్యాథ్స్​ కాన్సెప్ట్​లను బాగా ప్రాక్టీస్​ చేయాలి.

ఎన్విరాన్​మెంటల్​ సైన్స్​: మొక్కలు, జంతువులు, పక్షులు, జీవావరణం, పంటలు, మానవ శరీరం, వివిధ రంగాల్లో విజేతలు, వాయు, నీటి కాలుష్యం, ఆహారం, ఆరోగ్యం, వ్యాధులు, పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్కీమ్స్​, చరిత్ర సంస్కృతి,ఆటలు నియమాలు, రాష్ట్రాలు–సరిహద్దులు, గ్రహాలు తదితర చాప్టర్లు చూసుకోవాలి.
మెంటల్​ ఎబిలిటీ: లెటర్​ సిరీస్​లు, ఆల్ఫాబెట్​, వర్డ్, నెంబర్​ అనాలజీ, క్లాసిఫికేషన్​, లాజికల్​ డయాగ్రమ్స్​ తదితర ప్రాథమిక చాప్టర్స్ చూసుకోవాలి.​ గతేడాది మోడల్​ ప్రశ్నపత్రం అఫీషియల్​ వెబ్​సైట్​లో పెట్టారు. స్టూడెంట్స్​ దాన్ని డౌన్​లోడ్​ చేసుకొని పరిశీలిస్తే ప్రశ్నల సరళి అర్థమవుతుంది. ఓఎంఆర్​ షీట్స్​ కూడా పెట్టారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​
కామన్​ ఎంట్రెన్స్​ ఎగ్జామ్​100 మార్కులకు కండక్ట్​ చేస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్​ టైప్​లో ఉంటాయి.  క్వశ్చన్​ పేపర్​ తెలుగు, ఇంగ్లిష్​ భాషల్లో ఇస్తారు. నాలుగో తరగతి స్టాండర్డ్​లో వచ్చే ప్రశ్నలకు సరైన ఆన్సర్స్​ గుర్తించి ఓఎంఆర్​ షీట్​లో బబుల్​ చేయాలి. 

గురుకులాలు    సీట్లు
సోషల్​ వెల్ఫేర్​ సొసైటీ    18,560
ట్రైబల్​ వెల్ఫేర్​ సొసైటీ    4,777
బీసీ వెల్ఫేర్​ సొసైటీ    20,800
జనరల్​ వెల్ఫేర్​ సొసైటీ    2,800
మొత్తం సీట్లు    46,937

ముఖ్య సమాచారం
దరఖాస్తులు : ఆన్ లైన్ లో..
అప్లికేషన్ ఫీజు: రూ.100
అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం: మార్చి 10
చివరి తేది: ఏప్రిల్ 3
ఎంట్రెన్స్ ఎగ్జామ్ : మే 30(ఉదయం 11
నుంచి ఒంటి గంట వరకు)
వెబ్ సైట్ : tgcet.cgg.gov.in