రెండు పడకల ఐసోలేషన్ టెంట్లు రెడీ అయితున్నయ్

రెండు పడకల ఐసోలేషన్ టెంట్లు రెడీ అయితున్నయ్
  • డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడి

న్యూఢిల్లీ: స్క్రీనింగ్, ఐసోలేషన్, క్వారంటైన్ కోసం రెండు పడకల టెంట్లను తయారు చేయడం ప్రారంభించినట్లు డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. కరోనా సస్పెక్టెడ్ లేదా కరోనా సోకిన పేషెంట్లు ఒంటరిగా ఉంగే పరిస్థితి లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే రెండు వేర్వేరు పడకలుండే టెంట్ల తయారీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ప్రారంభించిందని చెప్పింది. 9.55 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గుడారాలు వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్, తేలికపాటి స్టీల్, అల్యూమినియం కాంబినేషన్లతో తయారవుతాయని తెలిపింది. హాస్పిటల్స్ లోనే కాకుండా ఈ గుడారాలను ఏ ప్రదేశంలోనే ఏర్పాటు చేసుకోవచ్చని, తక్కువ ప్లేస్ లోనే ఆస్పత్రిలో ఉండే అన్ని సౌకర్యాలు అందులో కల్పించవచ్చిన పేర్కొంది. ఇప్పటికే కాన్పూర్‌లోని ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీ ఈ గుడారాలను తయారు చేసిందని, 50 యూనిట్స్ ను అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి పంపించామని తెలిపింది.

‘‘నాగ్‌పూర్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ((ఓఫాజ్), శానిటైజేషన్, ఫ్యూమిగేషన్ చాంబర్‌ను అభివృద్ధి చేసింది. ఇది పూర్తిగా పోర్టబుల్, ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఓఫాజ్ ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద దీనిని ఏర్పాటు చేశారు”అని డిఫెన్స్ మినిస్ట్రీ పేర్కొంది.