
సంగారెడ్డి, వెలుగు: సినీ నటుడు సోనూసూద్‌పై అభిమానం పెంచుకున్న ఏడేళ్ల ఓ బుడ్డోడు టీవీ పగలగొట్టాడు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. న్యాల్కల్ ఎస్సీ కాలనీకి చెందిన విరాట్ అనే బాలుడు టీవీలో సినిమా చూస్తున్నాడు. విలన్‌గా నటించిన సోనుసూద్ ను హీరో కొట్టే సీన్ చూడగానే విరాట్‌కు కోపం వచ్చింది. కొవిడ్ టైంలో అందరినీ ఆదుకున్న సోనూసూద్ అంకుల్ని కొడతావా అంటూ బయటి నుంచి రాయి తెచ్చి టీవీని పగలగొట్టాడు. తల్లిదండ్రులు అదిచూసి షాకయ్యారు. సీన్లు చూసి టీవీని బద్దలు కొడతావా అని అడిగితే సోనూసూద్ అంకుల్ ని కొడితే ఊరుకోనంటూ గట్టిగా వాదించాడు.