
Facebook, X, whatsapp, youtube లేని దేశాన్ని ఊహించగలమా.. ఈ సోషల్ మీడియా లేదంటే ఆ దేశ జనం భరించగలరా.. ఈ సోషల్ మీడియా ప్లాట్స్ ఫాం లేకుండా ఆ దేశం ఎలా ఉంటుందో ఊహించగలరా.. ఇప్పుడు ప్రపంచానికి ఓ దేశం నిరూపించింది.. అది కూడా మన భారతదేశం పక్కనే ఉంది.. అదే నేపాల్ దేశం. ఇప్పుడు నేపాల్ దేశంలో ఫేస్ బుక్ కనిపించదు.. వాట్సాప్ పని చేయదు.. Xలో పోస్టులు పెట్టలేరు.. ఇన్ స్ట్రాగ్రాం చూలేరు.. య్యూటూబ్ లో అన్ని ఛానెల్స్ చూడలేరు.. అసలు ఇవన్నీ లేకుండా ఎలా బతకాలంటూ నేపాల్ కుర్రోళ్లు రగలిపోతున్నారు. దీనికి కారణం నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించటమే. 2025, సెప్టెంబర్ 4వ తేదీ నుంచి అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాం బ్యాన్ చేసింది అక్కడి ప్రభుత్వం. నాలుగు రోజులుగా పిచ్చెక్కిపోయిన యంగ్ కుర్రోళ్లు.. వీధుల్లోకి వచ్చారు.. రణరంగం చేశారు. ఇప్పుడు నేపాల్ వీధుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు యుద్ధమే చేస్తున్నారు. సోషల్ మీడియా లేకుండా ఎలా అంటే గొంతెత్తి నిరసిస్తున్నారు.
నేపాల్ లో బ్యాన్ ఎందుకు..?
నేపాల్ టెలి కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఐదేళ్ల క్రితం ఓ నిబంధన తీసుకొచ్చింది. సోషల్ మీడియా సంస్థలు అన్నీ కూడా విధిగా ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. నేపాల్ సంస్కృతి సంప్రదాయాలు, పద్దతులు, కంటెంట్ విషయంలో నియంత్రణ ఉండాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియాల్లో వచ్చే అసభ్యకరమైన కంటెంట్ విషయంలో ఆయా కంపెనీలే బాధ్యత వహించాలని.. ఆయా కంపెనీలకే నియంత్రణ ఉండాలనేది అక్కడి ప్రభుత్వం చట్టం చేసింది. ఐదేళ్లుగా ఏ కంపెనీ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లాయి. నేపాల్ సుప్రీంకోర్టు కూడా నేపాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే నేపాల్ ప్రభుత్వం.. ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోని యూట్యూబ్, ఫేస్ బుక్. ఇన్ స్ట్రా, వాట్సాప్ ఛానెళ్లను కట్ చేసింది.
ALSO READ : నేపాల్లో జెన్-Z విప్లవం..
ప్రభుత్వ నిర్ణయంతో జెన్ Z కుర్రోళ్లు రెచ్చిపోయారు
చేతిలో సెల్ ఫోన్.. అందులో సోషల్ మీడియా లేనిదే నిద్రపట్టని నేపాల్ కుర్రోళ్లకు.. ఒక్కసారిగా అన్నీ బ్యాన్ కావటాన్ని జీర్ణించుకోలేకపోయారు. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్న కుర్రోళ్లు.. ఒక్కసారిగా నేపాల్ రాజధాని ఖాట్మాండ్ లో విధ్వంసానికి దిగారు. నేపాల్ పార్లమెంట్ ను ముట్టడించారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. బనేశ్వర్ అనే ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పటంలో కాల్పులు జరిపారు పోలీసులు. ఈ ఘటనలో ఓ యువకుడు చనిపోయాడు. ఆ తర్వాత నిరసనలు దేశం అంతా వ్యాపించాయి. జనరేషన్ Z అంటే 13 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వాళ్లు.
అవినీతిపై ప్రశ్నిస్తున్నందుకే నిషేధం :
సోషల్ మీడియా బ్యాన్ చేస్తేనే ఇంతలా ఆందోళనలు చేస్తారా అంటూ ప్రశ్నించిన వాళ్లకు.. నేపాల్ కుర్రోళ్లు చెబుతున్న సమాధానం కూడా షాకింగ్ గా ఉంది. మేం ఆందోళన చేస్తున్నది సోషల్ మీడియా నిషేధం గురించి కాదు.. ప్రభుత్వం అవినీతిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నందుకే అంటూ సమాధానం ఇస్తున్నారు. సోషల్ మీడియాను అణిచివేయటం అంటే ప్రభుత్వ వైఖరి ఏంటో అర్థం కావటం లేదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు నేపాల్ యువకులు. ఇతరులు దీన్ని భరించారు.. మేం భరించాలనుకోవటం లేదు.. ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం అంటూ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు.
దేశంలో పరిస్థితులు అదుపు తప్పటంతో సైన్యాన్ని రంగంలోకి దించింది నేపాల్ ప్రభుత్వం. ఆర్మీ, పోలీసుల కాల్పుల్లో తొమ్మిది మంది యువకులు చనిపోయారు.
ఓవరాల్ గా నేపాల్ దేశం ఇప్పుడు సోషల్ మీడియాకు దూరంగా.. యువత ఆందోళనకు చాలా దగ్గరగా ఉంది. సోషల్ మీడియా బ్యాన్ ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు అనుకున్న అక్కడి ప్రభుత్వానికి ఇప్పుడు యువత ఆందోళనల రూపంలో అంతకంటే పెద్ద ప్రమాదం పొంచి ఉంది.