లాక్ డౌన్: మాకూ రేషన్ కావాలంటున్న సెక్స్ వర్కర్లు

లాక్ డౌన్: మాకూ రేషన్ కావాలంటున్న సెక్స్ వర్కర్లు

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో దేశంలోని చాలామంది పేదలు కష్టాలు పడుతున్నారు. లాక్ డౌన్ వల్ల ముంబైలోని రెడ్ లైట్ ప్రాంతమైన కామతిపురాలో సెక్స్ వర్కర్లు కూడా రోడ్డున పడ్డారు. తమ రోజూవారీ అవసరాలు కూడా తీర్చుకోవడానికి వారు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్జీవోలు చేసే సాయమే వీరికి ఇప్పుడు ఆధారం అయింది. వారిచ్చే భోజనం ప్యాకెట్లతోనే సెక్స్ వర్కర్లు కడుపు నింపుకుంటున్నారు.

ఎస్‌ఏఐ (సోషల్ యాక్టివిటీస్ ఇంటిగ్రేషన్) అనే ఎన్జీఓ యొక్క ప్రాజెక్ట్ మేనేజర్ అజిత్ బండేకర్ మాట్లాడుతూ.. ‘మేం ఇక్కడ కామతీపురాలో ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాం. ఒక వేళ మేం ఇక్కడ ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయకపోతే వారికి తిండి కూడా దొరకదు. లాక్ డౌన్ వల్ల పోలీసులు వారిని ఆ ప్రాంతం నుంచి బయటకు కూడా రానీయడంలేదు’ అని అన్నారు.

‘లాక్ డౌన్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చేతిలో డబ్బు లేక, తినడానికి తిండి లేక చాలా కష్టాలు పడుతున్నాం. పేదలందరికి ఇచ్చినట్లు మాకు రేషన్ ఎందుకు ఇవ్వరు. మాకు ఎటువంటి రేషన్ అందడంలేదు. ఎన్జీఓలు ఇచ్చే ఆహారమే మా అందరికి ఆధారం. ప్రభుత్వం మాకు కూడా రేషన్ అందేలా చూడాలి’ అని ఓ సెక్స్ వర్కర్ తమ బాధను వ్యక్తం చేశారు.

భారతదేశంలో కరోనా వల్ల మొత్తం 4375 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 122 మంది చనిపోయినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

For More News..

పిల్లి కోసం కోర్టు మెట్లెక్కిన యజమాని

సీఎం కేసీఆర్ మాటమీద నిలబడతారా? ఓవైసీని అరెస్ట్ చేస్తారా?

జూలోని పులికి కూడా కరోనా వైరస్

పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగిన ఏపీ ఎమ్మెల్యే