
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి పంచముఖి హనుమాన్ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. ఆలయ కమిటీ కొత్త పాలక వర్గ ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆలయ కమిటీ పాలక వర్గ ప్రతినిధులు నిజాయతీగా పని చేయాలన్నారు. చైర్మన్‌గా వైద్య కిషన్‌రావు, సభ్యులుగా కొత్త భీమ్రాజు, దాసోజ్ శ్రీనివాస్‌రెడ్డి, గంగాయణి, గజవాడ శంకరయ్య ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కామారెడ్డి నియోజక వర్గంలోని పలువురికి రూ. 16 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అందించారు.