విద్యార్థులకు కాన్సర్పై అవగాహన పోటీలు

విద్యార్థులకు కాన్సర్పై అవగాహన పోటీలు

షాద్ నగర్, వెలుగు: షాద్ నగర్ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ, పీజీ మహిళా కాలేజీలో క్యాన్సర్ పై సోమవారం అవగాహన సదస్సు పోటీలు నిర్వహించారు. ఇస్కాన్ కూకట్ పల్లి, తెలంగాణ ఉన్నత విద్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 17 మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్యాన్సర్ లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్సపై ప్రసంగించారు. 

ఇందులో గెలిచిన విజేతలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపల్ నీతా తెలిపారు. మహిళల్లో క్యాన్సర్ అవగాహన, ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్లు అఫ్రోజహాన్, ముంతాజ్, అధ్యాపకులు డా. కే. కళాజ్యోతి, శ్రీలత, రాజేశ్వరి పాల్గొన్నారు.