Shah Rukh Aamir Salman: ఒకే స్టేజిపై బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ టాప్ ఖాన్స్.. ఎందుకో తెలిస్తే ఫ్యాన్స్కు పండగే!

Shah Rukh Aamir Salman: ఒకే స్టేజిపై బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ టాప్ ఖాన్స్.. ఎందుకో తెలిస్తే ఫ్యాన్స్కు పండగే!

బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ టాప్ స్టార్స్‌‌‌‌‌‌‌‌ అయిన ఖాన్ త్రయం ఒకేసారి కలిసి కనిపిస్తే... ఆ ఫ్రేమ్ ఎంతో క్రేజీగా ఉంటుంది కదూ. చాలా రోజుల తర్వాత సల్మాన్, షారుఖ్, ఆమీర్ ఇలా కలిసి కనిపించారు. సౌదీ అరేబియాలో జరిగిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో ఇలా కలిసి సందడి చేశారు. తను, ఆమిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిల్మ్ బ్యాగ్రౌండ్‌‌‌‌‌‌‌‌ ఉన్న ఫ్యామిలీస్‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చామని, కానీ షారుఖ్‌‌‌‌‌‌‌‌ మాత్రం ఢిల్లీ నుంచి వచ్చి తన టాలెంట్‌‌‌‌‌‌‌‌తో స్టార్ అయ్యాడని సల్మాన్‌‌‌‌‌‌‌‌ ప్రశంసలు కురిపించారు.

ఇందుకు షారుఖ్ స్పందిస్తూ.. తాను ఆమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సల్మాన్‌‌‌‌‌‌‌‌లా ఫ్యామిలీ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కనుక తనకు కూడా ఫిల్మ్ బ్యాగ్రౌండ్‌‌‌‌‌‌‌‌ ఉన్నట్టేనని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు ఫిదా అయిన ఆమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. అందుకే షారుఖ్ స్టార్ అయ్యాడని ప్రశంసించారు. అభిమానులతో ఎమోషనల్‌‌‌‌‌‌‌‌గా కనెక్ట్ అవడమే అసలైన స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డమ్ అని షారుఖ్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించారు.

ముగ్గురం కలిసి నటించడం ఇష్టమే కానీ మేకర్స్‌‌‌‌‌‌‌‌ తమని భరించలేరు అంటూ సల్మాన్ సరదాగా చెప్పారు. ఇటీవల షారుఖ్‌‌‌‌‌‌‌‌ కొడుకు ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన ‘ది బ్యాడ్స్‌‌‌‌‌‌‌‌ ఆఫ్​ బాలీవుడ్‌‌‌‌‌‌‌‌’ చిత్రంలో ఈ ముగ్గురూ అతిథి పాత్రల్లో మెరిశారు.