KING Glimpse: షారుక్‌ ఖాన్‌ బర్త్‌డే స్పెషల్.. ‘పఠాన్‌’ కాంబో రిపీట్.. ‘కింగ్‌’ గ్లింప్స్‌ గూస్ బంప్స్

KING Glimpse: షారుక్‌ ఖాన్‌ బర్త్‌డే స్పెషల్..  ‘పఠాన్‌’ కాంబో రిపీట్.. ‘కింగ్‌’ గ్లింప్స్‌ గూస్ బంప్స్

బాలీవుడ్ ఇండస్ట్రీని శాసించడమే కాకుండా కోట్లాది మంది హృదయాలను దోచుకున్న బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్. కింగ్ ఆఫ్ హార్ట్స్గా బాలీవుడ్ ఆడియన్స్ తన నటనతో సేవా కార్యక్రమాలతో నిరూపించుకున్నారు. షారుఖ్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది.

ఇవాళ ఆదివారం (నవంబర్ 2న) సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతో పాటుగా ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విషెష్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే షారుఖ్‌.. తన ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్ అందించారు. 

షారుక్‌ తన 61వ బర్త్ డే స్పెషల్గా కొత్త మూవీ అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా తన నెక్స్ట్ సినిమా టైటిల్ ప్రకటిస్తూ.. వీడియో గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. మాస్, యాక్షన్ డైరెక్టర్గా పేరొందిన సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ‘కింగ్‌’ (KING) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హై ఆక్టేన్ అంశాలతో గ్లింప్స్‌ అదిరిపోయింది. ఇందులో షారుఖ్ స్టైలిష్, ఫియర్స్, మరియు పవర్-ప్యాక్డ్ లుక్లో కనిపిస్తున్నారు.

గన్‌ ఫైట్స్‌, ఫైర్‌ సీక్వెన్స్‌లు, షారుఖ్‌ డైలాగ్‌ డెలివరీ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. నిమిషం 11 సెకన్లు ఉన్న ఈ వీడియో, రిలీజైన క్ష‌ణాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి దూసుకెలుతుంది. కేవలం, గ్లింప్ల్సే ఇంతటి రసవత్తరమైన మాస్ ఉంటే, ట్రైలర్ ఎలా ఉంటుందో ఊహించేసుకోండి.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్.. బాద్ షా షారుక్ ఖాన్తో ఆల్రెడీ ఇండస్ట్రీ సూపర్‌హిట్‌ ఫిల్మ్ అందించారు. ‘పఠాన్‌’ మూవీతో షారుక్‌- సిద్ధార్థ్‌ కాంబినేషన్‌ ఇండియా ఆల్ టైం రికార్డులు సాధించింది. ఈ క్రమంలో కింగ్తో వీరిద్దరూ ఎలాంటి రికార్డులు కొల్లగొట్టనున్నారో.. అంచనాలు పెరిగిపోయాయి. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ మరియు మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన కింగ్ మూవీ 2026 లో విడుదల కానుంది.