అప్సర కేసులో కీలక విషయాలు వెల్లడించిన శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి

అప్సర కేసులో కీలక విషయాలు వెల్లడించిన శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన అప్సర హత్యకేసు విషయంలో  శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి కీలక విషయాలను మీడియాకు వెల్లడించారు . 2023 జూన్ 5న సాయికృష్ణ..  అప్సర మిస్ అయిందని మిసింగ్ కంప్లైంట్ ఇచ్చాడని తెలిపారు. దీంతో తాము  విచారణ స్టార్ట్ చేశామని చెప్పారు.  తమ విచారణలో హత్యకంటే ముందు ఇద్దరు కారులో ట్రావెల్ చేసినట్టుగా గుర్తించామన్నారు.  సైటిఫిక్ ఏవిడెన్స్, సీసీ ఫుటేజ్ ట్రాకింగ్ తో కేసును ట్రేజ్ చేశామని తెలిపారు.  మృతురాలు అప్సర, నిందితుడు సాయికృష్ణ  ఇద్దరు కలిసి ఉన్న ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.  
2023, జూన్ 3వ తేదీన మాట్లాడాలంటూ.. అప్సరను సరూర్ నగర్ రమ్మని చెప్పాడు సాయికృష్ణ . అతను చెప్పినట్లే అప్సర సరూర్ నగర్ వచ్చింది. అప్సరను తీసుకుని సాయికృష్ణ శంషాబాద్ ప్రాంతానికి వెళ్లాడు . అక్కడ కారు ముందు సీటులో పడుకున్న అప్సరను గమనించిన సాయికృష్ణ కారు కవర్ తో ఉపిరాడకుండా  చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ప్రతిఘటించడంతో కార్లో ఉన్న బెల్లం దంచే కర్రతో బలంగా కొట్టాడు. దీంతో అప్సర అక్కడికక్కడే చనిపోయిందని డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు.  డెడ్ బాడీని మ్యాన్ హోల్లో వేసి ఇసుక సిమెంట్ తో సాయికృష్ణ ప్యాక్ చేశాడని, రెండు లారీల ఇసుకను ఇద్దరి సహాయంతో తెపించాడని తెలిపారు.  

అప్సర, సాయికృష్ణ ఇద్దరికి మంచి సాన్నిహిత్యం ఉందని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. ఈ హత్యను మిస్సింగ్ కేసుగా చిత్రీకరించాలని సాయికృష్ణ  ప్లాన్ చేశాడన్నారు. పెళ్లి చేసుకోవాలని అప్సర ..  సాయి కృష్ణను నిలదీసిందని, ఈ విషయం తెలిస్తే ఎక్కడ తన పరువు పోతుందో అనే ఉద్దేశంతో సాయికృష్ణ హత్య చేశాడని తెలిపారు.  గతంలో ఒకసారి అప్సరను హత్య  చేయాలని సాయికృష్ణ  ప్లాన్ చేసినట్లు విచారణ తేలిందన్నారు. అప్సర సీరియల్స్ లో నటిచిందని చెప్పిన డీసీపీ ..  సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్న అప్సరను సాయి కృష్ణ  ట్రాప్ చేసినట్టుగా విచారణలో తెలిసిందన్నారు.  అప్సర పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు.