మహబూబాబాద్/గద్వాల/ పెద్దపల్లి, వెలుగు : ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సొంత వర్గంలోని ప్రజాప్రతినిధులే తిరగబడుతున్నారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసులో జరిగిన ఆవిర్భావ వేడుకల సందర్భంగా స్వయంగా సీఎం కేసీఆరే ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారనే సమాచారం ఉందని, తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన అన్నట్టుగానే పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై సొంత పార్టీ ప్రజాప్రతినిధులే ఆరోపణలు గుప్పిస్తున్నారు.
మహబూబాబాద్ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, గద్వాల జిల్లా అలంపూర్ శాసనసభ్యుడు అబ్రహం, పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిలపై గులాబీ పార్టీ ప్రజాప్రతినిధులు మర్లవడ్డారు. మానుకోటలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ఫండ్స్ ను తమకు తెలియకుండా కేటాయించారంటూ ఆ పార్టీ కౌన్సిలర్లు కొద్ది రోజులుగా నిరసన తెలుపుతున్నారు. మూడు రోజుల కింద దీక్ష చేసి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. మరోవైపు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ప్రతి దానికి ఓ రేటు కడుతున్నారని ఆ పార్టీకే చెందిన వడ్డేపల్లి వైస్ ఎంపీపీ ఫైర్అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిపై శుక్రవారం కౌన్సిలర్లు సోషల్‌మీడియా వార్ స్టార్ట్ చేశారు. మనోహర్‌రెడ్డి అవినీతిని నిరూపిస్తామంటూ కౌన్సిలర్ల వాట్సాప్ గ్రూపులో పోస్టులు పెట్టారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో పార్టీలో ఏర్పడిన ఈ కొత్త సమస్యల నుంచి ఎలా గట్టెక్కాలా అని అధిష్ఠానం ఆలోచిస్తున్నది.
మానుకోటలో రూ.50 కోట్ల లొల్లి
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గత జనవరిలో కొత్త కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మున్సిపాలిటీ డెవలప్‌మెంట్‌కోసం ఎస్డీఎఫ్ ఫండ్స్ తరూ.50 కోట్లు మంజూరు చేశారు. ఇటీవలే నిధుల మంజూరు జీవో కూడా విడుదలైంది. మొత్తం 36 వార్డుల్లో పనులను గుర్తించాల్సిన సమయంలో కౌన్సిలర్ల ప్రమేయం లేకుండానే ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్రాంమ్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మీటింగ్ పెట్టుకున్నారు. ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని, ఎస్డీఎఫ్ ఫండ్స్‌ను ఎమ్మెల్యే తన సొంత నిధుల్లా భావిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ప్రొటోకాల్ పాటించడం లేదని ఫైర్ అయ్యారు. మూడు రోజుల కింద మున్సిపాలిటీ దగ్గర ఒక రోజు దీక్ష చేశారు. గురువారం కలెక్టర్ శశాంకకు వినతిపత్రం కూడా ఇచ్చారు. గొడవ ఎందుకని.. స్వయంగా ఎమ్మెల్యేతో కూర్చుని చర్చించుకుందామని మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి విజ్ఙప్తి చేసినా వినలేదు.
ఆయనకు ప్రతిదానికి పైసలివ్వాల్సిందే
ఆలంపూర్ నియోజకవర్గంలో ప్రతి పోస్టింగ్ కు ఎమ్మెల్యే అబ్రహం డబ్బులు తీసుకుంటున్నారని, సెక్రెటరీ డిప్యూటేషన్ కోసం రూ.5 వేలు లంచం తీసుకున్నాడని వడ్డేపల్లి వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ గౌడ్ శుక్రవారం తీవ్ర ఆరోపణలు చేశారు. దీన్ని వీడియో తీసి పార్టీ జిల్లా ఇన్ చార్జి, ఎమ్మెల్సీ రవీందర్ రావుకు పంపించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతూ ఎమ్మెల్యే అబ్రహం రూ.5వేలు లంచం తీసుకుని కొంకల పంచాయతీ సెక్రెటరీగా ఓబులమ్మను నియమించారన్నారు. ఇదొక్కటే కాదని ప్రతి పోస్టింగ్ కు డబ్బులు తీసుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో అబ్రహంకు కాకుండా వేరే వారికి టికెట్ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి కౌన్సిలర్ల గ్రూపులో పోస్టులు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తూ కౌన్సిలర్ల శుక్రవారం పోస్టులు పెట్టారు. కొంతకాలం కింద సుల్తానాబాద్ మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టే టైంలోనే, పెద్దపల్లి మున్సిపాలిటీలోనూ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సగానికి పైగా కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. చైర్పర్సన్ ఎమ్మెల్యే కోడలే కావడంతో అప్పుడు మనోహర్‌రెడ్డి చొరవ తీసుకొని కౌన్సిలర్లను బుజ్జగించారు. ఈ నెల 26న పెద్దపల్లిలో పార్టీ ప్లీనరీ జరిగింది. దీనికి ఎమ్మెల్సీ, చీఫ్ విప్ భానుప్రసాద్‌రావు వచ్చే సమయానికి అందరూ తినడానికి వెళ్లారు. ఎమ్మెల్యేనే ఇలా చేయించాడన్న ఆరోపణలు వచ్చాయి.
అంతేగాక టౌన్ నుంచి అనుకున్నంత మందిని ప్లీనరీకి తీసుకురాలేకపోయారని ఎమ్మెల్యే కౌన్సిలర్లపై గుర్రుగా ఉన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను తన క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని మందలించినట్టు తెలిసింది. దీంతో శుక్రవారం ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేస్తూ కౌన్సిలర్ల వాట్సాప్‌గ్రూపులో పోస్టులు వచ్చాయి. గత ఎజెండాలో తమకు తెలియకుండా దాదాపు రూ.కోటి వరకు కుంభకోణం జరిగినట్టు అనుమానాలున్నాయని, అందులో కనీసం 50 శాతం అవినీతిని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఓ కౌన్సిలర్ పోస్ట్ పెట్టాడు. పట్టణంలో పనులకు సంబంధించి ఏం జరుగుతుందో కౌన్సిల్ సభ్యులకు తెలియడం లేదని, అలాంటి దానికి కౌన్సిల్ ఎందుకని ప్రశ్నించారు. అధికారులు, చైర్పర్సన్, ఎమ్మెల్యే కలిసి కూర్చుని తీర్మానించుకుంటే సరిపోతుందన్నారు. కౌన్సిలర్లను గుర్తించడం లేదని, వచ్చే ఎన్నికల్లో ప్రతి వార్డులో ఓ రోబోను అభ్యర్థిగా ప్రకటించుకోవాలని సెటైర్లు వేశారు.
వారికి తోచిన వెల్లుల్లనే చెల్లించవలసి ఉంటే కౌన్సిల్ ఉండి ప్రయోజనం ఏముంది మున్సిప మున్సిపల్ ఆఫీసు తరుపున పట్టణంలో ఏం అ జరుగుతుందో కౌన్సిల్ సభ్యులకు తెలియకుండా చేయదలుచుకుంటే మరి అధికారులు మరియు పెట్టారు. చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారు ఒకచోట కూర్చొని పాలిటీలో వాటిని తీర్మానించుకొని చెల్లించుకోవచ్చు కదా కౌన్సిల్ ఎన్నుకొనడం ఎందుకు ఎన్నికలు అందుకు కౌన్సిల్ సభ్యులను బ్లఫ్ చేయడం దేనికి
సభ్యులు గమనించ వలసింది ఏమిటంటే గత ఎజెండాలలో మనకు తెలియకుండా దాదాపు కోటి రూపాయల వరకు కుంభకోణం జరిగినట్టు అనుమానం కలదు నేను ఈ కోటి రూపాయలలో కనీసం 50% రుజువు చేయడానికి రెడీగా ఉన్నాను మీరు కోరినచోట మీరు కోరిన వేదిక పైన ఎక్కడ పిలిచినా రెడ్డి