రామ మందిరంతో బీజేపీకి లబ్ధి ఉండదు: శరద్ పవార్​

రామ మందిరంతో బీజేపీకి లబ్ధి ఉండదు: శరద్ పవార్​

పుణె: అయోధ్య రామ మందిర అంశం ముగి సిందని, దానిపై ఎవరూ చర్చించడంలేదని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. ప్రస్తుత లోక్‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఈ అంశం వల్ల ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. శుక్రవా రం పుణె జిల్లా పురందర్‌‌‌‌లో ఆయన మీడియా తో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నిక ల్లో రామమందిరం కీలక పాత్ర పోషిస్తుందా? అని మీడియా ప్రశ్నించగా.. ​పవార్​పై విధంగా స్పందించారు. 

అయితే, రాముడి విగ్రహా న్ని ప్రతిష్ఠించినప్పటికీ సీతాదేవి విగ్రహాన్ని పెట్ట లేదని ఒక సమావేశంలో కొంతమంది మహిళ లు ఎత్తి చూపారని ఆయన గుర్తుచేశారు. దీంతో పవార్ వ్యాఖ్యలపై బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌‌‌‌కులే అభ్యం తరం వ్యక్తంచేశారు. ఇలా వ్యాఖ్యానించే ముందు అయోధ్యలోని రామ మందిరం గురిం చి సమాచారాన్ని సేకరించి ఉండాల్సిందని అన్నారు. రాముడు అక్కడ బాలుడి రూపంలో ఉన్నాడని చంద్రశేఖర్​ గుర్తుచేశారు.