మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల కీలక కామెంట్స్ చేశారు. ఆస్తి కోసం తమ చిన్నాన్న వివేకా హత్య జరగలేదన్నారు. తమ బాబాయి కూతురు సునీత పేరు మీద ఆస్తులు ఎప్పుడో వీలునామా రాశారని చెప్పారు.
‘ వివేకానంద రెడ్డి ప్రజల మనిషి. పులివెందుల, కడప జిల్లా ప్రజలకు ఆయన గురించి బాగా తెలుసు. ఆయన సాధారణ జీవితం గడిపారు. కొన్ని మీడియా సంస్థలు ఆయన గురించి, పర్సనల్ లైఫ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నాయి. మా చినాన్న పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. వివేకాపై చేస్తున్న కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను. లేని వ్యక్తి మీద ఎందుకు విష ప్రచారం చేస్తున్నారు’ అని షర్మిల వ్యాఖ్యానించారు.