Biker First Glimpse: బాహుబలి, మాస్ జాతరతో.. శర్వానంద్ స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ గ్లింప్స్‌

 Biker First Glimpse: బాహుబలి, మాస్ జాతరతో.. శర్వానంద్ స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ గ్లింప్స్‌

శర్వానంద్ హీరోగా  అభిలాష్ కంకర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బైకర్’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

రీసెంట్‌గా విడుదలైన  ఫస్ట్ లుక్,  టైటిల్‌తో ఇప్పటికే మంచి బజ్‌ క్రియేట్ అయ్యింది. తాజాగా  ఫస్ట్ ల్యాప్  గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్‌ను శుక్రవారం (Oct31న) విడుదలవుతున్న బాహుబలి: ది ఎపిక్,  మాస్ జాతర సినిమాలకు అటాచ్‌గా  చూపించబోతున్నారు.

ప్రేక్షకులకు ఇది డిజిటల్ విడుదలకు ముందే థియేట్రికల్ ట్రీట్‌గా నిలుస్తుంది. ఇక నవంబర్ 1న సాయంత్రం 4:05 గంటలకు ఈ గ్లింప్స్‌ను డిజిటల్‌ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌లో రేసర్‌‌ లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు శర్వానంద్.  తను  హీరోగా నటిస్తున్న 36వ సినిమా ఇది.  మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

శర్వానంద్ సినిమాలు:

శర్వానంద్ ‘బైకర్’తో పాటుగా సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న 38వ చిత్రమిది. ఇదొక రూరల్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా. 1960 తెలంగాణ- సరిహద్దులో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందింస్తున్నారు. ఈ మూవీలో శర్వానంద్‌  సరసన అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్ హయతి నటించనున్నారు.

అలాగే, సామజవరగమన వంటి బ్యూటిఫుల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘నారీ నారీ నడుమ మురారి’ చేస్తున్నారు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్‌‌. సంక్రాంతికి రీలిజ్ కానుంది.