HBD Sharwanand: మనమే అంటూ వస్తోన్న శర్వానంద్..బర్త్డే స్పెషల్ అదిరింది భయ్యా

HBD Sharwanand: మనమే అంటూ వస్తోన్న శర్వానంద్..బర్త్డే స్పెషల్ అదిరింది భయ్యా

టాలీవుడ్‌లో టాలెంటెడ్ యాక్టర్స్ లలో శర్వానంద్ (Sharwanand) ఒకరు. చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న ఈ యంగ్ హీరో..సైలెంట్గా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నాడు. ప్రస్తుతం శర్వా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న మూవీ నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 

ఇవాళ (మార్చి 6న) శర్వానంద్ బర్త్డే స్పెషల్గా తన 35వ సినిమాకు ‘మనమే’ అని టైటిల్‌ని లాక్ చేశారు. వరల్డ్ ఆఫ్ శర్వా పేరుతో వచ్చిన టైటిల్ మేకింగ్ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ గమనిస్తే..పెయింటింగ్ రోలర్‌ పట్టుకొని హీరో శర్వానంద్ కనిపిస్తుండగా..పక్కనే ఓ చిన్నబ్బాయి ప్రపంచాన్ని గమనిస్తున్నట్లు ఉన్నారు. శర్వా ఆ పిల్లోడి వైపు చూస్తూ ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ స్టోరీపై ఇంట్రెస్ట్ పెంచుతోంది.

లండన్ బ్రిడ్జ్, థేమ్స్ నదిని కూడా ఇందులో చూడొచ్చు.క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టీజర్ చివరలో హీరోయిన్ కృతి శెట్టి కనిపించింది. చాలా కాలంగా ఊరిస్తున్న ఈ సినిమా అప్డేట్..ఎట్టకేలకు రావడంతో శర్వా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే, ఈ మూవీ షూటింగ్ ఈ మధ్యన కంప్లీట్ చేసుకుంది. ఇక నుంచి వరుస అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. 

Also Read : నేను ఆత్మహత్య చేసుకుంటా.. వీడియో పెట్టిన సినీ నటి

శర్వానంద్ కి సరైన హిట్ వచ్చి చాలా కాలంగా అయింది. మహా సముద్రం,ఆడవాళ్ళు మీకు జోహార్లు కమర్షియల్గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఒకే ఒక జీవితం సినిమా మాత్రం పర్వాలేదనిపించింది.అయితే, శతమానం భవతి, మహానుభావుడు వంటి సినిమాల తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ను ఇప్పటి వరకు శర్వానంద్ అందుకోలేకపోయారు.మరి క్లిన్ ఫ్యామిలీ సోల్ గా వస్తోన్న మనమే మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. 

ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత  కాగా..కృతి ప్రసాద్ అండ్ ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఖుషి సినిమాతో సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హేషం అబ్దుల్ వాహద్ సంగీతం అందిస్తున్నాడు.