అంత పని చేయొద్దమ్మా : నేను ఆత్మహత్య చేసుకుంటా.. వీడియో పెట్టిన సినీ నటి

అంత పని చేయొద్దమ్మా : నేను ఆత్మహత్య చేసుకుంటా.. వీడియో పెట్టిన సినీ నటి

ప్రముఖ తమిళ నటి విజయలక్ష్మి (Vijayalakshmi) పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ మంగళవారం (మార్చి5న) వీడియోను పోస్ట్ చేయడం.. ఇపుడు సంచలనంగా మారింది. 

మీడియా మిత్రుల అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 29న నేను ఓ వీడియో విడుదల చేశా. నామ్‌ తమిళర్‌ కట్చి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు సీమాన్‌ (Seeman) నాతో మాట్లాడాలని, నాతో కలిసి జీవించాలని కోరా. నేను ఎంతో ఆవేదనతో ఆ వీడియో పంపించా. ఆత్మహత్య చేసుకుంటానని కూడా చెప్పా. ఇప్పుడు మార్చి 5వ తేదీ పూర్తయింది ఎలాంటి స్పందన లేదు. 

గతంలో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి..మూడేళ్ల పాటు నాతో రహస్య జీవితాన్ని గడిపారు. నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇప్పుడు మోసం చేసి నన్ను నడిరోడ్డుపై వదిలేశారు.

ప్రస్తుతం కర్ణాటకలో జీవించలేని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు నాకు ఎవరూ సహకరించడం లేదు. ఎవరైనా మానవత్వం కొద్దీ సహకరించినా వారిని తరిమికొడుతున్నారు. ఇదే నా చివరి వీడియో. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నా. కర్ణాటక పోలీసులు తదుపరి వార్త చెబుతారు. నా మరణంపై సీమాన్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది’’ అని విజయలక్ష్మి ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు. మరి సీమాన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలియాల్సి ఉంది. 

విజయలక్ష్మి తెలుగులో ‘హనుమాన్ జంక్షన్‌’ మూవీలో నటించింది. తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by The Whistle (@thewhistletv)