కంటోన్మెంట్‌‌లో బీఆర్‌‌‌‌ఎస్ అభ్యర్థి పాదయాత్ర 

కంటోన్మెంట్‌‌లో బీఆర్‌‌‌‌ఎస్ అభ్యర్థి పాదయాత్ర 

కంటోన్మెంట్, వెలుగు: కంటోన్మెంట్‌‌ను అభివృద్ధి పథంలో నడిపించిన గులాబీ పార్టీ వైపే జనమంతా ఉన్నారని బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత తెలిపారు.  సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 2వ వార్డు పరిధిలో ఆమె ఆదివారం పాదయాత్ర చేపట్టారు. రసూల్‌‌పురా, ఇందిరమ్మ నగర్, శ్రీలంక బస్తీలో ఇంటింటికీ తిరిగి ఓటు వేయాలని  అభ్యర్థించారు. ఈ సందర్భంగా లాస్యనందితకు  స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.  

లాస్య నందితను స్థానిక ప్రజలు భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..  కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే బీఆర్ఎస్‌‌కే ఓటేయాలని కోరారు. పాదయాత్రలో బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, సీనియర్ నాయకులు దేవేందర్,  టీఎన్ శ్రీనివాస్, ముజాయిద్ ఖాన్, నరేశ్, ముక్రం తదితరులు పాల్గొన్నారు.