
మద్నూర్ వెలుగు: మద్నూర్ లోని పోచమ్మ ఆలయంలో సోమవారం ఉదయం రాజస్థానీ సమాజ్ ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా హోలీ తర్వాత వారానికి శీతల్ ఉత్సవాన్ని జరుపుకుంటామని, దేవత పోచమ్మ ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేస్తామని చెప్పారు. శీతల్ పండుగ సందర్భంగా నిన్న వండిన వంటలు తినడం సంప్రదాయమని వారు వివరించారు.