OTT MOVIE : ఊరి సమస్య తీరుతుందా?

OTT MOVIE : ఊరి సమస్య తీరుతుందా?

ఊరి సమస్య తీరుతుందా?

టైటిల్ : షెహర్ లఖోట్​
డైరెక్షన్​ : నవదీప్​ సింగ్, దేవిక భగత్
కాస్ట్ : ప్రియాన్షు పెయిన్​యులి, చందన్ రాయ్, కుబ్బ్ర సెయిత్, శృతి మెనన్, చందన్ రాయ్ సన్యాల్ 
లాంగ్వేజ్ : తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ
ప్లాట్​ ఫాం : అమెజాన్ ప్రైమ్​ వీడియో

రాజస్తాన్​లోని ఒక ఊరి పేరు లఖోట్​. గిరిజనులు ఉండే ఆ ప్రాంతంలో మార్బుల్ మైనింగ్ జరుగుతుంటుంది. ఆ మైనింగ్ ఆపేయమని వాళ్లు అడ్డుకుంటుంటారు. కానీ, కార్పొరేట్​ కంపెనీలు మాత్రం దాన్ని ఆపడానికి ఇష్టపడవు. ఈ ఇన్సిడెంట్​ జరగడానికి పదేండ్ల ముందు ఆ ఊరి నుంచి బయటకు వెళ్లిపోతాడు దేవ్ తోమర్ (ప్రియాన్షు పెయిన్​యులి). పదేండ్ల తర్వాత ఆ ఊరికి వస్తాడు. ఊళ్లో జరిగే హత్య కేసులో ఇరుక్కుంటాడు. అంతేకాకుండా దేవ్​కి ఓ గతం కూడా ఉంటుంది. అతని గతం ఏంటి? ఈ కేసులో ఎందుకు ఇరుక్కున్నాడు? ఊరి సమస్యను  అతను తీర్చగలడా? నిజానికి లఖోట్ అనేది మైనింగ్​ విలేజ్​ కాదు. సిరీస్​ కోసం అలా క్రియేట్ చేశారు. లీడ్​ రోల్స్​ చేసిన ప్రియాన్షు, చందన్​ రాయ్ సన్యాల్​, కుబ్బ్ర సెయిత్ బాగా నటించారు. ఎనిమిది ఎపిసోడ్ల ఈ సిరీస్​ పర్వాలేదు అనిపిస్తుంది. 

రెస్క్యూ సక్సెస్​

టైటిల్ : మిషన్ రాణిగంజ్ : ది గ్రేట్ భారత్ రెస్క్యూ
డైరెక్షన్​ : టిను సురేశ్ దేశాయ్
కాస్ట్ : అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, రవికిషన్, కుముద్ మిశ్రా
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్​ ఫాం : నెట్​ఫ్లిక్స్

రాణిగంజ్ (పశ్చిమబెంగాల్) బొగ్గు గనుల్లో మైనింగ్ పనులు జరిగేటప్పుడు వరదలు వస్తాయి. ఆ ప్రమాదంలో 65 మంది కార్మికులు చిక్కుకుంటారు. వాళ్లని కాపాడడానికి మైనింగ్ ఇంజినీర్​, రెస్క్యూ  ఆఫీసర్ జశ్వంత్ సింగ్ గిల్ (అక్షయ్ కుమార్) వస్తాడు. కార్మికులను కాపాడే క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అందరినీ కాపాడగలిగాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో ఎమోషన్స్, అక్షయ్ యాక్టింగ్​ బాగున్నాయి. జశ్వంత్ సింగ్ క్యారెక్టర్​లో అక్షయ్​ పర్ఫార్మెన్స్ కట్టిపడేస్తుంది. కాకపోతే ఫస్టాఫ్ సాగదీతలా అనిపిస్తుంది. సెకండాఫ్​ నుంచి కథలో స్పీడ్ పెరుగుతుంది. 

రాక్షసుల అడ్డా

టైటిల్ : స్వీట్ హోం 2 
డైరెక్షన్​ : లీ ఇయుంగ్​ బక్, జాంగ్​ యోంగ్​ వూ, పార్క్​ సొ హ్యున్
కాస్ట్ : సాంగ్​ కాంగ్​, లీ జిన్ వూక్, గొ మిన్​ సి, పార్క్ గ్యు యోంగ్​, లీ దొ హ్యున్
లాంగ్వేజ్ : కొరియన్, ఇంగ్లిష్​, హిందీ
ప్లాట్​ ఫాం : నెట్​ఫ్లిక్స్

సీజన్​1లో చా హ్యున్​ సు (సాంగ్​ కాంగ్​) అనే హైస్కూల్ స్టూడెంట్​ చుట్టూ కథ తిరుగుతుంది. అందులో గ్రీన్​ హోమ్​ నివాసితులైన లీ జిన్ వూక్, లీ సి యోంగ్, గొ మిన్ సి, పార్క్ గ్యు యోంగ్​లు ఇరుగుపొరుగు వాళ్లతో గొడవపడుతుంటారు. వాళ్లంతా ఒక్క రాత్రిలో రాక్షసులుగా మారిపోతారు. ఈ సీజన్​లో ఏం జరుగుతుందంటే.. చా హ్యున్​ సు గ్రీన్​ హోమ్​లో మిలిటరీకి  సరెండర్​ అయిపోవడంతో ఈ సీజన్​ మొదలవుతుంది. మిగతా నివాసితుల ఇళ్లు రాక్షసులతో నిండిపోతాయి. వాళ్లలో కొందరు మిలిటరీ వాళ్లకు పట్టుబడతారు. వాళ్లంతా మిలిటరీ ఆర్డర్స్ ఫాలో అవుతుంటారు. మరో వైపు లీ సి యోంగ్​ ఆర్మీ ఫోర్సెస్​లో భాగమవుతుంది. మిగతా కథలో ఆమే కీలకం. చివరికి ఏమవుతుందనేది ఇంట్రెస్టింగ్​ పాయింట్. కచ్చితంగా చూడాల్సిందే. హారర్ ఎలిమెంట్స్​ ఉన్న ఈ సిరీస్​ మొదటి సీజన్​ బాగా పాపులర్ అయింది. దాంతో సీజన్​ 2పై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్లే  ఈసారి కథలో కొన్ని మార్పులు జరిగాయి. పర్ఫార్మెన్స్​ విషయానికొస్తే.. సాంగ్ కాంగ్ యాక్టింగ్ చాలా బాగుంది.