నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి నిరసన సెగ

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి నిరసన సెగ

నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మరోసారి నిరసన సెగ ఎదురైంది. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామపంచాయతీ శేరిల్లా గ్రామంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డిని  గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణకు శేరిల్లా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకుని కారు ముందు కూర్చొని నిరసన తెలిపారు.

గతంలో తమ గ్రామంలో గుడి నిర్మాణానికి నిధులు ఇస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఎలాంటి సాయం చేయలేదని గ్రామస్తులు మండిపడ్డారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఎమ్మెల్యే గుర్తు పట్టడం లేదని శేరిల్లా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.