జార్ఖండ్ ఉద్యమ నేత, మాజీ సీఎం శిబుసోరెన్ కన్నుమూత

జార్ఖండ్ ఉద్యమ నేత, మాజీ సీఎం శిబుసోరెన్ కన్నుమూత

జార్ఖండ్ మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ( ఆగస్టు 4 ) ఉదయం ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న శిబు సొరేన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జార్ఖండ్ ప్రస్తుత సీఎం హేమంత్ సొరేన్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు.శిబు సొరేన్ మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

1973లో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం ఉద్యమించారు శిబు సొరేన్. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విజయం సాధించి జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు శిబు సొరేన్. మూడుసార్లు జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు శిబు సొరేన్.

శిబు సొరేన్ మరణంతో జార్ఖండ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివాసీల హక్కుల కోసం తుదిశ్వాస వరకు పోరాడిన శిబు సొరేన్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమనేతగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన శిబు సొరేన్ కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. శిబు సొరేన్ మృతితో జార్ఖండ్ రాష్ట్రానికి తీరని లోటు ఏర్పడిందని పేర్కొంటున్నారు విశ్లేషకులు.