విచారణలో కీలక విషయాలు బయటపెట్టిన శిల్పాచౌదరి

విచారణలో కీలక విషయాలు బయటపెట్టిన శిల్పాచౌదరి

వడ్డీల పేరుతో ప్రముఖుల నుంచి కోట్లు కాజేసి అరెస్టయిన శిల్పాచౌదరి మొదటి రోజు పోలీసుల కస్టడీ ముగిసింది. విచారణలో పలు కీలక విషయాలు బయటపెట్టింది. శిల్పా బినామీలు ,బ్యాంక్ స్టేట్మెంట్ లపై పోలీసులు ఆరా తీశారు. ఇప్పటి వరకు నమోదైన ఫిర్యాదులపై విచారణ చేసి శిల్పా స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు పోలీసులు. కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించారనే కోణంలో విచారణ చేశారు. కాల్ డేటాలోని కొంత మంది వ్యక్తులను సంప్రదించారు పోలీసులు. అయితే మొదట పోలుసులకు సమాధానం చెప్పని శిల్పా.. ఆధారాలన్నీ తన  ముందు ఉంచడంతో నోరు విప్పింది. తనకు డబ్బు ఇచ్చిన వారు చాలా మంది అప్పుగా ఇచ్చారని.. కొంత మంది బ్లాక్ మనీని ఇన్వెస్ట్ మెంట్ ల ద్వారా వైట్ గా మార్చేందుకు  ఇచ్చారని శిల్పా చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.