తెరుచుకున్న షిర్డీ ఆల‌యం.. రోజుకి 6వేల‌మందికి సాయి ద‌ర్శ‌నం

తెరుచుకున్న షిర్డీ ఆల‌యం.. రోజుకి 6వేల‌మందికి సాయి ద‌ర్శ‌నం

మహారాష్ట్రలో ప్రార్థనామందిరాలు తెరచుకున్నాయి. ఇవాళ(సోమవారం) షిర్డీ సాయిబాబా దేవస్థానం తెరచుకోవడంతో భక్తులు ఆ క్షేత్ర దర్శనం కోసం ఉత్సాహం చూపుతున్నారు. అయితే ఆలయాలలో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, మాస్కులను కచ్చితంగా ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాదు షిర్డీ దేవస్థానం ట్రస్ట్‌ రోజూకు ఆరువేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తోంది. కౌంటర్లతో పాటు, ఆన్‌లైన్‌ టికెట్లు జారీ చేస్తున్నట్టు షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ తెలిపింది. అలాగే 65 ఏళ్లు దాటినవారికి, పదేళ్లలోపు చిన్నారులకు అనుమతి లేదని చెప్పింది.