ఈ షర్ట్ వేసుకుంటే వినికిడి సమస్యున్నా పాట వినొచ్చు

ఈ షర్ట్ వేసుకుంటే వినికిడి సమస్యున్నా పాట వినొచ్చు

మాంచి జోష్​ ఉన్న పాటలకు సౌండ్​ తోడైతే వచ్చే మజా మస్తుంటది. లైట్​ మ్యూజిక్​తో మెలోడీలు వింటే కలిగే ఆ అనుభూతి సూపరుంటది. ఎమోషన్​కు ఎమోషన్​, జోష్​కు జోష్​! మనకైతే ఓకే, మరి ఆ ఎంజాయ్​మెంట్​ వినికిడి సమస్య ఉన్న వాళ్లకు ఎలా వస్తుంది? అలాంటి వాళ్లకోసం లండన్​కు చెందిన క్యూట్​సర్క్యూట్​ అనే కంపెనీ ‘సౌండ్​ షర్ట్​’ను తయారు చేసింది. ఆ షర్టే వినికిడి సమస్య ఉన్నోళ్లు  పాటల్ని ఫీలయ్యేలా చేస్తుంది. అదెట్లా సాధ్యమంటే, అంతా టెక్నాలజీ మహిమ. అవును, బధిరులు సంగీతాన్ని ఎంజాయ్​ చేసేలా ఆ షర్ట్​లో 16 సెన్సర్లను కంపెనీ పెట్టింది. వేర్వేరు చోట్లున్న ఆ సెన్సర్లు మ్యూజిక్​కు తగ్గట్టుగా షర్ట్​లో వైబ్రేషన్లను పుట్టిస్తాయి. ఆ వైబ్రేషన్లు ఒంటిని తాకి సంగీతాన్ని ఆస్వాదించేలా చూస్తాయి.

ఇదంతా జరగాలంటే ఆ షర్ట్​ను కంప్యూటర్​కు కనెక్ట్​ చేయాల్సి ఉంటుంది. సంగీతంలోని నోట్స్​కు తగ్గట్టు షర్ట్​లో ఆ సెన్సర్లను అన్ని చోట్లా పెట్టింది. ఉదాహరణకు బాస్​ నోట్స్​ను డేటాగా మార్చే సెన్సర్లను తుంటి భాగంలో, వయొలిన్​ వంటి వినసొంపైనా నోట్స్​ సెన్సర్లను ఛాతి, మెడ భాగంలో పెట్టింది. షర్ట్​ను కంప్యూటర్​కు కనెక్ట్​ చేసిన తర్వాత ఈ సెన్సర్లు రియల్​టైం మ్యూజిక్​ను డేటాగా మార్చి వైబ్రేషన్​ పుట్టిస్తాయి. వైబ్రేషన్​ పుట్టినప్పుడు సౌండ్​ సిస్టంలో వెలిగినట్టే ఆయా సెన్సర్లున్న చోట లైట్లు కూడా వెలుగుతుంటాయి. సెన్సర్లంటున్నరు, మరి వాటి వైర్లతో ఒంటికి ఇబ్బందిగా ఉండదా అంటే, అలాంటి ఇబ్బందులుండకుండా వైర్లను వాడలేదు. మెత్తటి బట్టతో షర్టును తయారు చేశారు.  దీంతో చికాకు జంఝాటం అనేదే ఉండదు. ఈ సౌండ్​ షర్టును బధిరులపై ప్రాక్టికల్​గా కంపెనీ టెస్టు కూడా చేసింది. వాళ్లంతా సంగీతాన్ని చాలా ఎంజాయ్​ చేశారంటోంది. ఆలోచన మంచిదే అయినా, ఆ షర్టుకయ్యే ఖర్చే చాలా ఎక్కువ. అవును, దాని ధర దాదాపు 2 లక్షల 61 వేల రూపాయలు.