విద్యార్థినులపై లైంగిక వేధింపులు..బాబా అరెస్ట్

విద్యార్థినులపై లైంగిక వేధింపులు..బాబా అరెస్ట్

చెన్నై : అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బాబా సుశీల్ హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. త‌న స్కూల్ లో చ‌దివిన విద్యార్థినులపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌నే అభియోగాలు ఎదుర్కొంటున్న స్వామీజీగా చెప్పుకునే సుశీల్ హ‌రి ఇంట‌ర్నేష‌నల్ స్కూల్ అధిప‌తి శివ‌శంక‌ర్ బాబాను ఢిల్లీలో సీబీసీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌పై శివ‌శంక‌ర్ బాబాపై పోక్సో స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన త‌మిళ‌నాడు పోలీసులు ఆపై కేసును సీబీసీఐడీకి బ‌ద‌లాయించారు. గ‌త‌వారం బాబాకు గుండె పోటు రావ‌డంతో ఆయ‌న త‌మిళ‌నాడు బాల‌ల హ‌క్కుల పరిర‌క్ష‌ణ క‌మిష‌న్ ఎదుట విచార‌ణ‌కు గైర్హాజ‌రయ్యారు. శివ‌శంక‌ర్ బాబా త‌మ‌ను లైంగికంగా వేధించాడ‌ని స్కూల్ పూర్వ విద్యార్థులు ట్వీట్ చేయ‌డంతో ఈ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. విద్యార్థుల ఫిర్యాదుపై స్పందించి ద‌ర్యాప్తు చేప‌ట్టిన త‌మిళ‌నాడు పోలీసులు ఆపై కేసును సీబీసీఐడీకి బ‌ద‌లాయించారు.