
బాలీవుడ్ లో హీరోయిన్స్ గా ప్రస్తుతం ఉన్న వారిలో స్టార్ కిడ్స్ ఎక్కువే ఉన్నారు. సౌత్ లో మాత్రం స్టార్ కిడ్స్ కు హీరోయిన్లు గా చాన్సులు చాలా తక్కువగా వస్తున్నాయి. హీరోయిన్ గా రాణించాలని కొందరు హీరో, హీరోయిన్స్ కూతుర్లు ప్రయత్నాలు చేస్తున్నా వర్కవుట్ అవడం లేదు.
సీనియర్ హీరో రాజశేఖర్, జీవిత దంపతుల ఇద్దరు కుమార్తెలు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లిద్దరికీ సరైన సక్సెస్ లు దక్క లేదు. నటిగా నిరూపించుకునేందుకు కూడా మంచి అవకాశాలు రాలేదు. అందం విషయంలో ఉత్తరాది ముద్దుగుమ్మలకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నా. ఆఫర్లు రావడం లేదు.
ఈ మధ్య కాలంలో ఈ స్టార్ కిడ్స్ స్కిన్ షో వైపు అడుగులు వేస్తున్నారు. హద్దులు దాటకుండా శివాత్మిక స్కిన్ షో చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా మరోసారి శివాత్మిక చీర కట్టులో కన్నుల విందు చేసింది. సోషల్ మీడియాలో శివాత్మిక రాజశేఖర్ షేర్ చేసిన ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పింక్ కలర్ చీరలో తెల్లని బ్లౌజ్ ధరించి చాలా సింపుల్ అండ్ కూల్ లుక్ లో సందడి చేసింది.