
మహారాష్ట్రలోని జల్గావ్‌లో దారుణమైన ఘటనా చోటు చేసుకుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు అప్పులు చెయ్యొద్దని మందలించినందుకు ఒక దారుణమైన నేరానికి దారితీసింది. ఈ కాలంలో స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే తక్కువ టైంలోనే లక్షాధికారి కావొచ్చని, మంచి లాభాలు వస్తాయని, మాయ మాటలు చెబుతూ మోసాలు చేయడం ఎక్కువైపోయాయి.
అయితే స్టాక్ మార్కెట్‌లో పెట్టిన డబ్బులు పోయాయని, ఇతరుల నుండి అప్పులు చేయవద్దని చెప్పినందుకు ఒక యువకుడు సొంత అమ్మమ్మపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో 73 ఏళ్ల వృద్ధురాలు 12 రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది.
సమాచారం ప్రకారం ఈ దారుణం మహారాష్ట్రలోని జల్గావ్‌లో జూన్ 26న జరిగింది. అయితే నిందితుడు తేజస్ పొద్దార్‌గా పోలీసులు గుర్తించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన లీలాబాయి రఘునాథ్ విస్పుటే మంగళవారం పూణేలో చికిత్స పొందుతూ మరణించారు.
ALSO READ : ఆపిల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(COO) గా భారత సంతతి వ్యక్తి
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, తేజస్ స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాడు. తేజస్ అమ్మమ్మ లీలాబాయి కూతురి ఇంట్లో కొన్ని రోజులు ఉండటానికి వచ్చారు. అప్పుడే తేజస్ను లీలాబాయి దీని పై మందలిస్తూ హెచ్చరించింది. దింతో కోపోద్రిక్తుడైన తేజస్ గొడ్డలితో ఒక్కసారి దాడి చేసాడు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న ఆమెను మొదట గ్రామీణ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుండి జల్గావ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి, చివరకు మెరుగైన చికిత్స కోసం పూణేలోని ఆసుపత్రికి తరలించారు. అయినా కూడా ఆమె ప్రాణాలు దక్కలేదు.